గ‌త కొంత కాలంగా అధికార ప్ర‌భుత్వాన్ని ముచ్చెమ‌టలు ప‌ట్టించిన తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటి ఇక క‌నుమ‌రుగు కానుందా...?  ప్రొపెస‌ర్ కొదండ‌రాం ఒంట‌రి వాడు కానున్నాడా అంటే జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే అవున‌నే వాద‌న‌లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధ‌నోద్య‌మంంలో జేఏసీ పాత్ర ఎంత ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఏక‌తాటిగా పై తీసుకువ‌చ్చి ఉద్య‌మాల‌లో క్రీయాశీలక పాత్ర పోషించారు.


ఆప్ కోర్స్  కోదండ‌రామ్ జేఏసీ చైర్మ‌న్ కావ‌డం, ఉద్య‌మాల‌లో ప్ర‌ధాన పాత్ర పోషించ‌డంలో టీఆర్ఎస్ నేత, తాజా సీఎం కేసీఆర్ పాత్ర కూడా ఉందిలేండి. కానీ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం సీఎం కేసీఆర్ జేఏసీ ని పూర్తిగా పక్క‌న పెట్టేశారు. ఇప్ప‌టికే జేఏసీలో చీలిక వ‌చ్చేసింది. ఆల్రెడీ జేఏసీలో చీలిక వచ్చేసింది. ఇప్పుడిక కోదండరామ్‌ చేయడానికేమీ లేదు. అయితే, టీఆర్‌ఎస్‌కి సరెండర్‌ అయిపోవడం, లేదంటే ఏదన్నా పార్టీలో చేరిపోవడం. ఈ రెండూ తప్ప, తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌గా ఆయనకు 'దారి' దాదాపుగా మూసుకుపోయినట్లే.! 

కొత్త రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌రువాత ఉద్య‌మాల‌తో ఏం ప‌ని అనుకున్నారో ఎమో తెలియ‌దు కానీ సీఎం కేసీఆర్ కోదండ‌రామ్ ను పూర్తి గా మ‌రిచారు. అయినా తాను పెంచి పోషించిన 'మొక్క' తననే ఎదిరిస్తోంటే, ఆయన మాత్రం ఎందుకు ఊరుకుంటారు.? అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌తిప‌క్షమే లేకుండా పాల‌న సాగిస్తున్న కేసీఆర్ కు కోదండ‌రాం చెవులో జోరిగిలా త‌యార‌య్యారు.  రాష్ట్రంలో ఉన్న‌ టీడీపీ గానీ, కాంగ్రెస్‌గానీ, ఆఖరికి బీజేపీగానీ ప్రశ్నించలేకపోతున్నాయనీ, అలాంటిది కోదండరామ్‌ ప్రశ్నించడమేంట న్న అసహనం కేసీఆర్‌కి పెరిగిపోయింది. 

ఈ క్రమంలోనే కోదండరామ్‌ని 'విలన్‌'గా చూడటం మొదలుపెట్టారు సీఎం కేసీఆర్‌. చిత్రమైన విషయమేంటం టే, కేసీఆర్‌ ఇప్పటిదాకా బాహాటంగా ఎక్కడా కోదండరామ్‌ విషయంలో స్పందించలేదు. తాజాగా, ఈ రోజు తెలం గాణ జేఏసీకి చెందిన కొందరు నేతలు మీడియా ముందుకొచ్చారు. వీళ్ళంతా జేఏసీలో కోదండరామ్‌ని కొద్ది రోజు లుగా వ్యతిరేకిస్తున్నవారే. వీరందనినీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నడిపిస్తోందని కోదండరామ్‌ సన్నిహితులు ఆరోపి స్తున్నారు. 

తమను టీఆర్‌ఎస్‌ నడిపితే, మిమ్మల్ని ఎవరు నడుపుతున్నారంటూ కోదండరామ్‌కి అటువైపు నుంచి ప్రశ్నలు గట్టిగానే దూసుకొచ్చాయి. 'రాజకీయ పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదు..' అన్న ఒక్క వ్యాఖ్య, ఇప్పుడు జేఏసీని నిలువునా చీల్చేసింది. రాజకీయాలతో జేఏసీకి సంబంధం లేదని మొదట్లో చెప్పి, ఇప్పుడు రాజకీయాలతో అంటకాగడమేంటి.? అనే ప్రశ్నలు జేఏసీ నుంచే పుట్టుకురావడంతో కోదండరామ్‌ సైతం ఈ సంక్షోభంపై మాట్లా డలేని పరిస్థితి ఏర్పడింది. 

ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే, తెలంగాణ జేఏసీ అతి త్వరలో కనుమరుగైపోవడం ఖాయంగానే కన్పిస్తోంది. ఇన్నాళ్ళూ తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌గా కోదండరామ్‌ మీద అమితమైన ప్రేమ చూపించిన టీడీపీ, కాంగ్రెస్‌.. ఆఖరికి బీజేపీ కూడా ఇప్పుడాయన్ని లైట్‌ తీసుకున్నాయి. కొత్త‌గా పార్టీని ఏర్పాటు చేయాల‌ని భావించిన ఒంట‌రి వాడ‌య్యాడు. ఓ పార్టీని న‌డిపించే స్తోమ‌త లేదు కూడా. ఇలాంటి ప‌రిస్థితుల్లో కోదండ‌రామ్ ఏం చేస్తారో  చూడాలి మ‌రి...!

మరింత సమాచారం తెలుసుకోండి: