గ‌త నాలుగు నెల‌ల క్రితం ప్రధాని మోడీ వెలువరించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఇంకా పూర్తిగా తొలగ లేదు. ఆ నిర్ణయం దెబ్బకు దొరకని భారతీయుడు లేడు. దీంతో మోడీ తీసుకున్న ఆ నిర్ణయం ఆయనకు రాజ కీయంగా భారీ నష్టం కలిగిస్తుందని, యూపీ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు దెబ్బతింటాయని అంతా భావించారు.  అయితే... అక్కడ ఏడు దశల పోలింగ్ తరువాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో అటూఇటూగా బీజేపీకే ఆధిక్యం ఇచ్చా యి సర్వే సంస్థలు.. కానీ.. ఇప్పుడు ఆ సంస్థల అంచనా లను కూడా దాటేసి ఏకంగా 300కి పైగా స్థానాల్లో విజ యం దిశగా దూసుకెళ్తున్న బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల ఫీట్ ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా కనిపి స్తోంది.  

ఎందుకిలా... పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగిన కష్టాలను జనం మర్చిపోయారా.. లేదంటే అవినీతి - నల్లధనం నిర్మూ లనకు ఈ నిర్ణయం తీసుకున్నామంటూ మోడీ చెప్పిన మాటలను ప్రజలు నమ్మారా? అని ప్రశ్నించుకుంటే అవన్నీ చిన్న విషయాలని.. అంతకుమించిన విషయాల ప్రభావం యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తోందని అర్థమవుతోంది. అది బీజేపీ నమ్మకున్న బలమైన సిద్ధాంతం.. దశాబ్దాల పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ పక్కకు జరగని సింగిల్ అజెండా. అదే... ‘హిందూత్వం’.. బీజేపీని యూపీలో గెలిపిస్తున్నది అదే తప్ప ఇంకేదీ కాదు. 
    
యూపీ ఎన్నికల సందడి మొదలవగానే లెక్కలేనన్ని లెక్కలేసుకున్నాయి పార్టీలు.. రాజకీయ విశ్లేషకులు - మీడియా కూడా రకరకాల సమీకరణాలు చూపించాయి. సమాజ్ వాది పార్టీలో కుమ్ములాటల కారణంగా ఆ పార్టీ దెబ్బతింటుందని అంతా చెప్పారు.. అది నిజమే అయింది. అఖిలేశ్ కు ఆదరణ ఉన్నా ఎస్పీపై వ్యతిరేకత రావ డం వల్ల ఆ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఇది కూడా బీజేపీకి లాభించింది. దీంతో పాటు.. గత కొద్ది కాలం గా బీజేపీ గోసంరక్షణ విషయంలో దూకుడుగా వెళ్తోంది. అంతర్లీనంగా హిందూత్వ అంశాలతో ముడిపడిన గోసంబంధిత అంశాలు ఎన్నో వివాదాలకు కారణమవుతున్నాయి. 

గోవులను వధించేవారిపై దాడులు వంటి మీడియాలో హక్కుల ఉద్యమకారుల్లో వ్యతిరేకత తెచ్చినా సామాన్య హిందూ ప్రజల్లో మాత్రం మోడీపై ఉన్న క్రేజ్ మరింత పెరిగేలా చేశాయి. అంతేకాదు.. గోసంరక్షకారుల దూకుడు వల్ల బీజేపీ - మోడీపై ముస్లింలు వ్యతిరేకత పెంచుకుంటున్నారని.. ఆ ఓట్లన్నీ దూరమవుతాయన్న లెక్కలు వచ్చాయి. కానీ.. అలా దూరమైన ఓట్ల కంటే బీజేపీ గోసంరక్షణ - హిందూత్వ విధానాలకు ముచ్చటపడి ఆ పార్టీకి వచ్చిన హిందూ ఓట్లే ఎక్కువని తేలుతోంది.నిజానికి ముస్లిం ఓటు బ్యాంకు పొందడానికైనా పోవడానికైనా పరి మిత కారణాలే ఉంటాయి. 

కానీ.. హిందువుల ఓట్లకు సవాలక్ష కారణాలు. కులాలు.. వర్గాలు.. ముఠాలు.. పార్టీలు.. ఇలా ఎన్నీ ఈక్వేషన్లు. కానీ.. బీజేపీ ప్రో హిందూ అజెండా యూపీలో హిందూ ఓట్లను ఏకం చేసింది. అది ఆ పార్టీకి లాభించింది. అంతే కాదు  సమాజ్ వాది పార్టీ కానీ కాంగ్రెస్ కానీ తమ సిద్ధాంతాలపై ఎన్నడూ కట్టుబడి లేవు. ఒక్కో ఎన్నికలో ఒక్కోలా ప్రవర్తిస్తాయి. అటు మాయావతికి చెందిన బీఎస్పీ కూడా బహుజనుల పేరుతో మొదలైనా తొలుత దళితులు  ఆ తరువాత వారితో పాటు బీసీలు. ఆ తరువాత అగ్రవర్ణాలను కూడా కలుపుకొని ఈసారి వారందరినీ పక్కనపెట్టి ముస్లిం ఓటర్ల కోసం పూర్తిగా వారి పక్షం వహించింది. 

బీజేపీపై వ్యతిరేకతతో ముస్లింలు తమకు ఓట్లేస్తారన్న అత్యాశతో పూర్తిగా వారిపైనే కాన్సట్రేట్ చేసింది. దీంతో అంతవరకు బీఎస్పీకి అండగా ఉన్న మిగతావర్గాలు బీజేపీ వైపు మళ్లాయి. దీంతో బీఎస్పీకి వచ్చిన ముస్లిం ఓట్ల కంటే పోయిన హిందూ ఓట్లు ఎక్కవయ్యాయి. కానీ... బీజేపీ మాత్రం రాజకీయంగా ఇప్పటికీ జాతీయత హిందూ దేశం.. గోసంరక్షణ వంటి విషయాల్లో ఎవరు దూరమైనా భయం లేదంటూ తమ సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. అదే యూపీ ప్రజలకు నచ్చింది. వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు అనుకూలిస్తే 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి 2014 రిజ‌ల్ట్ ల‌ను రిపీట్ అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: