ఒక అమ్మాయి అంతంత మాత్రంగా ఉంటేనే కన్నార్పకుండా చూసే నేటి తరం యువకులు ఒక అందమైన అమ్మాయి కనబడితే ఇంకా ఎంత ఆతృతతో చూస్తారో అందరికీ విదితమే. అయితే మోడీ స్వచ్చ భారత కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రోడ్లను శుభ్రపరిచే సెలబ్రిటీలు రోజు రోజు ఎక్కువవుతున్న సమయంలో చీపురుకు ఎమ డిమాండ్ వస్తున్న సందర్భంలో ఒక యువతి తన వృత్తిలో భాగంగా చీపురు పట్టి రోడ్డంతా శుభ్రం చేస్తున్న సందర్భంలో ఆమె తో సేల్ఫీ కి స్థానిక ప్రజలు ఎగాబడుతున్నారట.



ఎందుకో ఆమెకు అంత క్రేజ్. ఆమె చేస్తున్న ఉద్యోగం ఏంటి అనేగా మీ డౌటు..? ఆమె చేస్తున్న ఉద్యోగం పేరు స్వీపర్. ఆ యువతి పేరు బబ్లీ..ఇంతకీ ఈమె ఏం చేస్తుందో తెలుసా? మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌ మున్సిపాలిటీలో స్వీపర్‌ గా పని చేస్తోంది. చూడగానే ఆకట్టుకునే రూపం. అందుకు తగ్గట్టుగానే నిత్యమూ మంచి డ్రస్ వేసుకుని, అంతే స్థాయిలో మేకప్ చేసుకుని తన పని పూర్తి చేసేందుకు వచ్చేస్తుంది.


Image result for madhya pradesh sweeper babli

వీధిలో ఆమెను చూసిన వారెవరైనా ఎవరో సినిమా హీరోయిన్ వచ్చిందని, ఇక్కడేదో షూటింగ్ ఉందని అనుకోవాల్సిందే. ఇప్పుడామె ఈ ప్రాంతంలో ఎంత ఫేమస్ అంటే, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎంతో మంది పోటీలు పడుతున్నారు. అందంగా తయారు కావడమంటే తనకెంతో ఇష్టమని చెప్పుకునే బబ్లీ, స్వీపర్ పని చేస్తున్నంత మాత్రాన చక్కగా అలంకరించుకోకూడదా? అని ప్రశ్నిస్తుంది. నిజమే కదా?

మరింత సమాచారం తెలుసుకోండి: