సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో మూడో ర్యాంకును కైవసం చేసుకున్న తెలుగుతేజం రోణంకి గోపాలకృష్ణ కోచింగ్ సెంటర్ల వ్యవహారశైలిపై మండిపడ్డారు. కోచింగ్‌ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దంటూ నిరుద్యోగులను సలహా ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోచింగ్ సెంటర్లు కావాలనే తన పేరును వాడుకుంటున్నాయని అన్నారు. కోచింగ్ సెంటర్లు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు.


కోచింగ్‌ సెంటర్లపై గోపాలకృష్ణ మండిపాటు

తనకెవరూ కోచింగ్ ఇవ్వలేదని, సొంతంగా ప్రిపేర్ అయ్యానని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యం సొంతంగా చదివానని, జనరల్ స్టడీస్ మాత్రం బాలలత గారి వద్ద శిక్షణ పొందానని అన్నారు. హైదరాబాద్ లోని కొన్ని కోచింగ్ సెంటర్లు తన పేరుతో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. సివిల్స్‌ పరీక్షలు రాయగోరే అభ్యర్థులు సొంత ప్రిపరేషన్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తే మంచిదని గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.


Image result for civils ranker gopala krishna

అలా కుదరని పక్షంలో నచ్చిన కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. అయితే కోచింగ్‌ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. కాగా, గోపాలకృష్ణకు సివిల్స్ లో ఆలిండియా మూడో ర్యాంకు వచ్చిన మరునాడే ప్రధాన పత్రికలన్నింటిలోను కొన్ని కోచింగ్ సెంటర్లు తమవాడే అంటూ ప్రకటనలు ఇచ్చుకున్నాయి. సొంతంగా చదువుకున్నవాడిని కూడా తమవాడే అంటూ ప్రచారం చేసుకోవడం పట్ల కోచింగ్ సెంటర్లపై విమర్శలు వెల్లువెత్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: