మాజి మంత్రులు ధర్మాణ ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు జైలుశిక్ష తప్పదా... ఇదే ఇప్పుడు రాష్ట్రరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సిబిఐ దాఖలు చేసిన వీరిద్దరి కౌంటర్ పిటిషన్ పై కోర్టులో సిబిఐ చేసిన వాదనలు సదరు మాజిమంత్రులు సబిత, ధర్మాణల గుండెల్లో గుబులు పుట్టించాయంటున్నారు వారి సన్నిహితులు.

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 14 ఏళ్ల జైలుశిక్ష విధించే విధంగా సబిత, ధర్మాణలు నేరానికి పాల్పడ్డారని సిబిఐ వాదించింది. ఈ సంధర్బంగా వారు చేసిన నేరాలు, వాటికి వర్థించే సెక్షన్లు, పడే శిక్షల వివరాలను కూడా ధర్మాసనం ముందుంచింది సిబిఐ. వాన్ పిక్ కు తన జివో ద్వారా ఏకంగా 1200 ఎకరాల భూమి అప్పనంగా అప్పగించారని, అంతే కాకుండా దాల్మియా సిమెంట్స్ కు అక్రమ జిఓ ద్వారా సబిత అక్రమ మైనింగ్ ట్రాన్స్ ఫర్ చేసారని సిబిఐ తెలిపింది.

అంతే కాదు, వారిద్దరు సాక్షులను ప్రభావితం చేస్థారనడానికి వారి మాట్లాడిన మాటలే కాదు, వారికున్న పలుకుబడిని కూడా పరిగణలోకి తీసుకుని కస్టడీకి అప్పగించాలని కోరింది. వారిద్దరి పేర్లు చార్జిషీట్ లో ధాఖలైనపుడు వారికి సిఎం, ఇతర మంత్రులు ఎంత అండగా నిలిచారో అందరికి తెలుసునని, ఇప్పటికి సిఎం, సహా మంత్రులంతా వారికి అండగా ఉన్నారన్న భయం సాక్షుల్లో ఉందని అందుకే వారిద్దరిని కస్టడీకి ఇవ్వాలని కోరింది సిబిఐ. దీంతో వారి కస్టడీ, పడే అవకాశమున్న శిక్షలపై రాజకీయాల్లో గరంగరం చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: