కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఫలిస్తోంది. ఇన్నాళ్లూ తనను కార్నర్లోకి నెట్టాలనుకున్న పార్టీల అసలు రూపం బయటపెట్టడానకి తెలంగాణాపై నిర్ణయం అంటూ హడావుడి చేస్తోంది. తీరా నిర్ణయం తీసుకుని, అసెంబ్లీకి తీర్మానం తెచ్చాక, తెలుగుదేశం వైకాపా ఏమంటాయో చూడాలని సరదా పడుతోంది. నిజానికి ఆ రెండు పార్టీలు కూడా సమైక్యం వైపే మొగ్గు చూపుతాయని కాంగ్రెస్ కు తెలియంది కాదు.

అయితే అసంబ్లీ వరకు ఆగకుండానే వైకాపా ముందడుగు వేసింది. అసలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎవరు? తీర్మానం చేయడానికి, రాష్ట్రాన్ని విభజించడానికి అంటూ ధ్వజమెత్తింది. అసలు కాంగ్రెస్ తన నిర్ణయం చెప్పమంటూ డిమాండ్ చేసింది. వర్కింగ్ కమిటీ అంటే కాంగ్రెస్ దే కానీ ప్రభుత్వానిది కాదు అని వైకాపా ఎందుకు అనుకోలేదో? అది సరే పోనీ కాంగ్రెస్ నిర్ణయం చెప్పిన తరువాత, మళ్లీ అఖిలపక్షం కావాలన్నదా వైకాపా ఆలోచన. వైకాపా పుట్టకముందే ఆ వ్యవహారాలన్నీ పూర్తయ్యాయి కదా? 

అంటే మళ్లీ మరోసారి పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలనా? అంటే మరికొంతకాలం జాప్యం జరగుతుంది. అదే కావాలా వైకాపాకు? మరేమిటి విషయం అన్నది వైకాపా ప్రకటనలో బాగా అర్ధం కాకున్నా, ఒకటి మాత్రం తేలిపోయింది. రాష్ఠాన్ని చీల్చడం ఆ  పార్టీకి ఇష్టం లేదని. మరి ఈ మాట చెప్పి, తెలంగాణాలో ఏం చేస్తుందో ఆ పార్టీ? 

మరింత సమాచారం తెలుసుకోండి: