సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్నా మనుషుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. సమాజం నాగరికత వైపు పయనిస్తున్న అనాగరిక కార్యక్రమాలకు మాత్రం కొందరు చామర గీతం పాడలేక పోతున్నారు. ఇంకా భారత గ్రామీణ వ్యవస్థ అనాగారికంలో కొట్టుమిట్టు ఆడుతుందని చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. దొంగ బాబాలను నమ్మకుడదని ప్రభుత్వం, మీడియా పని గట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నా గ్రామీణ ప్రజలు మాత్రం దాన్ని పెడ చెవిన పెడుతున్నారు. 


Image result for fraud baba

మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం శివారులోని వింగ్వా తండాలో ఓ బాబా ప్ర‌వేశించాడు. గ్రామ‌స్తుల చేతులు చూసి జాత‌కం చెప్పి వారి బాధ‌లు పోవాలంటే తాను చెప్పింది చేయాల‌ని అనేవాడు.అందుకు గానూ రూ.200 ఫీజుగా తీసుకునేవాడు. కొన్ని రోజుల త‌రువాత ఆ అమాయ‌క ప్ర‌జ‌ల‌ను మ‌రింత భ‌య‌పెట్టాడు. అష్ట‌ద‌రిద్రం ప‌ట్టుకోబోతోంద‌ని, తాను చెప్పిన‌ట్లు చేయ‌క‌పోతే తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని ఒక్కొక్క వ్య‌క్తికి చెబుతూ ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్దా రూ.15 వేల నుంచి 25 వేల చొప్పున తీసుకున్నాడు.


Related image

ఇలా మొత్తం కలిసి అందరి దగ్గర నుంచి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు వాసులు చేశాడు. వాసులు చేసిన డబ్బుతో ఎవరికీ చెప్పకుండా ఎంచక్కా అర్థరాత్రి పారిపోయి ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నాడు ఆ దొంగ బాబా. తీరా అసలు విషయం తెలుసుకొన్న గ్రామస్తులు దొంగ బాబా చేతిలో మోసపోయామని తెలిసుకొని జరిగిన తతంగాన్ని అంతా పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ బాబా కోసం గాలింపు ముమ్మరం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: