రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్‌ వ్యవహారం అంతు తేల్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. 10 రోజులుగా డ్రగ్ మాఫియా అకున్ సబర్వాల్ ను బెదిరిస్తోంది. ప్రతిరోజూ ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరించే డ్రగ్ మాఫియా... నిన్నటి నుంచి రూట్ మార్చింది. నీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతారో తెలుసు, ఏ వాహనాల్లో, ఎప్పుడు? ఎక్కడికి? వెళ్తారో కూడా తెలుసు... అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాయిస్ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా వచ్చినట్లు అధికారులు గుర్తించారు.



అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌ ముఠా నెదర్లాండ్‌, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్‌ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్‌ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్‌ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా సౌతాఫ్రికా నుంచి ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి.


Image result for akun sabharwal

అక్కడ డ్రగ్ మాఫియా ఎంత దారుణంగా ఉంటుందంటే.. ఒకవేళ తమకు అడ్డువచ్చినటువంటి పోలీసు అధికారి ఎంత పెద్దవారైనా సరే వాళ్లను హతమార్చేందుకు కూడా వెనుకాడని వంటి పరిస్థితి. గతంలో కూడా ఈ దేశంలో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. మరి ఇలాంటి సమయంలో అకున్ తో సహా ఆయన కుటుంబ సభ్యులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుతం పై ఉంది. ముఖ్యంగా వారి పిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: