రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షం కురుస్థోంది. పలితంగా వందలగ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ప్రభుత్వం తన సహాయంతో అండగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్థోంది.

అయితే చాలాప్రాంతాలకు సహాయక చర్యలు అందక ప్రజల పరిస్థితి భీతావహంగా మారింది. కరీంనగర్,ఖమ్మం వంటి జిల్లాల్లో హెలీకాప్టర్ల సహాయంతో ఆహారపదార్థాలు, అత్యవసర మందులు పంపిణీ చేస్థున్నారు. కేవలం మూడు జిల్లాల్లోనే 300గ్రామాలు జలధిగ్భంధనంలో ఉన్నాయి. వంద శిబిరాల్లో ఇప్పటికి 14వేల మందికి ఆశ్రయం కల్పించారు. ఇంకా వరదబాదితులను పునరావాస కేంద్రాలకు తరలిచడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరద పరిస్థితులను ఎప్పటికప్పుడ సమీక్షిస్థూ తగు సహాయచర్యలకు అధికారులను పురమాయిస్థున్నారు.

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, ఇది ఒడిషా కోస్థాంధ్ర మీదుగా అల్పపీడన ఆవర్థన ద్రోణిగా మారిందని, రాగల 48 గంటల్లో తెలంగాణ, కోస్థాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర సోమవారం ఉదయం మళ్లీ హెచ్చరించింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో భారీగా పంట నష్టం, ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరగడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనలు వ్యక్థం చేస్థున్నారు. నష్టనివారణ చర్యలు చేపట్టి, సహాయకార్యక్రమాలు ముమ్మరం చేయాలని కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: