మోడీ మీద ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించే పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ అదే పనిలో పడింది. భారత ప్రధాని మోడీ మీద ఇప్పుడు మళ్ళీ సంచలన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ సారి ఆ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ .

ఐక్యరాజ్య సమితి సదస్సు సందర్భంగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అనీ ప్రపంచానికి ఆ దేశం ఉగ్రవాదం ఎగుమతి చేస్తోంది అని , ఏ ఉగ్రవాద సంస్థ ని పరికించినా దాని రూట్ మూలాలు పాకిస్తాన్ లో కనపడుతున్నాయి అని స్పష్టం చేసిన సంగతి చూసాం మనం.

ఈ నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని సుష్మా స్వరాజ్‌ ఆరోపించింది, కానీ వారి దేశమే ఒక ఉగ్రవాది చేతిలో నడుస్తోందని ఎద్దేవా చేశారు.

మోదీ గుజరాత్‌ లో ముస్లింల రక్తం కళ్లజూశాడని అన్నారు. భారత్ లో ఆర్‌ఎస్ఎస్‌ ఒక ఉగ్రవాద సంస్థ అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదైన మోదీని ప్రధానిగా భారతీయులు ఎన్నుకున్నారని ఆయన ఆరోపించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: