తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటే సంబరాలే సంబరాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా కోట్లల్లో కోడి పందాలు,జూదం ఇతర వాటికి ఖర్చు చేస్తుంటారు.  అయితే ప్రభుత్వం ఎన్ని సార్లు వీటిపై ఆంక్షలు విధించినా..తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు..అక్కడి జనాలు.   ఆంధ్రాలో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. కోడి పందాల సందడి ప్రారంభమైంది. పోలీసుల దాడులూ మొదలయ్యాయి.ఈ కోడిపందేళ్లో రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. అప్పుడే ఎమ్మెల్యే చింతమనేని వంటి వారు పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు.

Image result for kodi pandalu

ఇది సంప్రదాయం అంటూ లాజిక్కులు వినిపిస్తున్నారు.  ఎక్కడో ఒక చోట దాడులు చేయడం.. కొందరిని పట్టుకోవడం వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ఐతే.. సంక్రాంతి దగ్గర పడే కొద్దీ ఈ సందడి మరింత జోరుగా ఉంటుంది. ప్రత్యేకించి కోడిపందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయి. ఇక పశ్చిమగోదావరి జిల్లా ఈ పందేలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ పందేలు దాదాపు కోట్లలోనే నడుస్తాయని అందరికీ తెలుసు.
Image result for kodi pandalu

అయితే ఈ పందేల వ్యవహారం తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. జగన్ సొంత మీడియా దీనిపై రాద్దాంతం చేసే అవకాశం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో కోడి పందాలు, జూదాల విషయంలో హద్దులు దాటొద్దంటూ నేతలకు సూచించారు. జూదాల విషయంలో పార్టీకి చెడ్డ పేరు తేవద్దంటూ హెచ్చరించారు. కోడిపందేలపై దృష్టి తగ్గించిన జన్మభూమి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. నియోజక వర్గాల అభివృద్ధికి జన్మభూమిలో చర్చలు జరపాలన్నారు.

Image result for kodi pandalu

పార్టీ ముఖ్యనేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంపైనా చంద్రబాబు నేతలకు కొన్ని సూచనలు చేశారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల నమోదు రాజకీయాలకు అతీతంగా జరగాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోందన్నారు. పది రోజులు జరగబోయే ఈ కార్యక్రమం ఓ పండగ లా నిర్వహించాలన్నారు. ప్రజలు తమ ఆలోచనలు, అభిప్రాయాలూ మరియు అనుభవాలను చర్చించే వేదికగా జన్మభూమి నిలిచి పోవాలని సీఎం అన్నారు. అంతా బాగానే ఉంది. మరి చంద్రబాబు మాటలను టీడీపీ నేతలు ఏమేరకు అమల్లో పెడతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: