ఈ మద్య ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో పలు సంచలనాలు జరుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికలే ఇక్కడ టీడీపి వర్సెస్ వైసీపీ కి పెద్ద యుద్దమే కొనసాగుతుంది.  ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నుంచి పలువురు టీడీపీలోకి జంప్ కావడంపై వైసీపీ నాయకులు ఎన్నో విమర్శలు చేస్తున్నారు.  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ డబ్బులన్నీ తమ పార్టీ నేతలను కొనడానికి ఉపయోగిస్తున్నారని..ఏపీ అభివృద్ది పక్కన బెట్టి తన స్వార్థం కోసం వైసీపీ నేతలకు మభ్య పెట్టి తమ పార్టీలోకి తీసుకు వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. 
Image result for ysrcp
తాజాగా ఇప్పటికే పలురురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.   తాజాగా ఇప్పుడు అధికార పార్టీకి పెద్ద షాక్..ఇటీవల మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ నేతలు కుట్రలు, బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. త్వరలోనే వారి బండారం బయటపడెతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 వివక్ష చూపిస్తున్న టీడీపీ
టీడీపీ నేతలు తనను ఎలా ప్రలోభ పెట్టారో త్వరలో ఆధారాలతో సహా చెబుతానని రవికాంత్ వ్యాఖ్యానించారు. టీడీపీ కుట్రలు భరించలేకనే రవికాంత్ వైసీపీని వీడారని గతంలోనే ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరిన రవికాంత్ అదే ఆరోపణలు చేశారు. రవికాంత్ రీ ఎంట్రీతో గుడివాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.కాగా, రవికాంత్‌ను తిరిగి తీసుకు రావడానికి కొడాలి నాని ప్రయత్నాలు చేసి సఫలమయ్యారని అంటున్నారు. అంతే కాదు మరికొందరు వైసీపీ నాయకులు టీడీపి ని వీడే అవకాశం ఉందని ఆయన అన్నారు. 
 ప్రలోభ పెడితే ఇలాగే జరుగుతుంది
కాగా, రవికాంత్‌ను తిరిగి తీసుకు రావడానికి కొడాలి నాని ప్రయత్నాలు మంచి ఫలితం ఇచ్చాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.  ఓ కూడలిలో పార్టీ జెండా ఎగురవేసి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటంలో వివక్ష చూపుతోందన్నారు.  చంద్రబాబు కుట్రపూరిత చర్యలకు పాల్పడితే..వైసీపీ చేతిలో చిత్తు కావాల్సిందే అని హెచ్చరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: