గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ ల మద్య పెద్ద యుద్దమే జరిగింది.  గెలుపు కోసం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహూల్ గాంధీ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.  మొత్తానికి గుజరాత్ లో బిజెపీ 99 సీట్లు కైవసం చేసుకొని జయకేతనం ఎగుర వేసింది. ఇప్పుడు ఇరు పార్టీలు కర్ణాటకలో జరగబోయే ఎన్నికలపై దృష్టి పెట్టారు.  ఇక బళ్లారి చుట్టుపక్కల జిల్లాల్లో బీజేపీకి మంచి పట్టు ఉందన్న విషయం తెలిసిందే..దీనికి కారణం ఆ పార్టీ ఎంపీ శ్రీరాములు. 
ఎమ్మెల్యే నాగేంద్ర
ఈయన ఎవరో కాదు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మైనింగ్ కింగ్ ఉన్న గాలి జనార్థన్ రెడ్డి ముఖ్య అనుచరుడు.  తాజాగా ఎంపీ శ్రీరాములు కి సన్నిహితుడు, కూడ్లగి శాసన సభ్యుడు బి. నాగేంద్ర షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యారు. గత కొంత కాలంగా బీజేపీలో మంచి పేరు సంపాదించిన బి.నాగేంద్ర త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  బీజేపీ ఎంపీ శ్రీరాములుకు ముఖ్యఅనుచరుడిగా ఉంటూ 2013 శాసన సభ ఉన్నికల్లో కూడ్లగిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన బి. నాగేంద్ర త్వరలో కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి సిద్దం అవుతున్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. 
బీజేపీకి డిపాజిట్ గల్లంతు
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోవడంతో ఆయన ఏ పార్టీలోకి చేరకుండా తటస్థుడిగా ఉంటూనే బీజేపీకి మద్దతిస్తూ వచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఒక దశలో నాగేంద్ర మళ్లీ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది. యితే అనూహ్య పరిణామాలతో నాగేంద్ర కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా ఇప్పటికే మంత్రి డీకే శివకుమార్, కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్‌ గుండూరావు తదితరులు ఆయనతో మంతనాలు జరిపారు.
 జనవరి 4వ తేదీ నిర్ణయం
త్వరలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.   జనవరి 4వ తేదీ కూడ్లగిలో బీజేపీ కర్ణాటక పరివర్తనా యాత్ర జరుగుతోందని, ఆ రోజు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని ఓ నిర్ణయం తీసుకుంటామని శ్రీరాములు వివరించారు. నాగేంద్రకు కూడ్లిగిలో మంచి పట్టు ఉండటంతో ఎలాగైనా అక్కడ పైచేయి సాధించాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: