పవన్ కల్యాణ్ పై కత్తి మహేశ్ కత్తులు నూరుతున్న సంగతి తెలిసిందే.! కొంతకాలంగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ గా చేసుకున్న కత్తి మహేశ్ చాలా కామెంట్స్ చేశారు. అయితే వాటన్నింటిపైనా పవన్ ఏనాడూ స్పందించలేదు. అయితే తాజాగా కత్తి మహేశ్ చేసిన కామెంట్స్ పవన్ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినవి. అందుకే వీటిపై స్పందించనున్నారు పవన్.

Image result for pawan kalyan and kathi mahesh

పవన్ కల్యాణ్ స్వార్థం కోసమే పార్టీ పెట్టారని, రాజకీయాల్లోకి అలాంటివారు రావడం వల్ల ఒరిగేదీమీ ఉండదని.. ఇలా చాలా కామెంట్స్ చేస్తున్నారు కత్తి మహేశ్. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. కత్తి వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నా.. పవన్ మాత్రం ఏనాడూ నోరు విప్పలేదు. ఎలాంటి ప్రకటనా చేయలేదు. ట్విట్టర్ లో కూడా కామెంట్ చేయలేదు. చాలా సింపుల్ గా తీసుకున్నారు.

Image result for pawan kalyan and kathi mahesh

ఇన్నాళ్లూ కత్తి మహేశ్ ఎలాంటి మాటలన్నా కూడా పవన్ పట్టించుకోలేదు. అయితే ఇటీవలికాలంలో కత్తి మహేశ్ శృతిమించిపోయారు. వ్యక్తిగత విషయాల్లోకి చొరబడుతున్నారు. పవన్ కల్యాణ్ తో పూనం కౌర్ సంబంధాలను ప్రశ్నిస్తూ కత్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. పూనం కౌర్ పవన్ కల్యాణ్ ను నాలుగె పెళ్లి చేస్కుంటానన్నారన్నారు. ఆమెకు పవన్ కల్యాణ్ తో ఉన్న సంబంధాలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వైరం.. తదితర అంశాలపై 6 ప్రశ్నలు సంధించారు కత్తి మహేశ్. చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Image result for pawan kalyan and kathi mahesh

కత్తి నోరు ఎక్కువైపోతోందని గ్రహించిన పవన్ కల్యాణ్ ఈ ఇష్యూపై సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. జనసేన కార్యాలయంలో ముఖ్యులతో భేటీ ఐన ఆయన.. దీనిపై ఎలా చేయాలనేదానిపై మంతనాలు జరిపినట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి జనసేన నేతలు కానీ, ఫ్యాన్స్ కానీ దీనిపై స్పందించొద్దని పవన్ ఆదేశించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని అటు జనసేన కార్యకర్తలకు, ఇటు అభిమానులకు చేరవేయాలని జనసేన కార్యలయాన్ని ఆదేశించారట. అయితే త్వరలోనే పవన్ కల్యాణ్ ఈ ఇష్యూపై స్పందిస్తారని తెలుస్తోంది. సరైన సమయంలో పవన్ కల్యాణ్ ఎంటరై కత్తి మహేశ్ కు సమాధానం చెప్పాలనుకుంటున్నారని ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: