కత్తి మహేష్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన పేరు.  ఒక్క మాటలో చెప్పాలంటే, పవన్ అభిమానులుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పవన్ ను విమర్శిస్తూన్నడంతో పవన్ అభిమానులు కత్తి మీద ఎదురు దాడికి దిగిన సంగతి తెలిసిందే. దీనితో కత్తి మహేష్ కూడా ఎక్కడ తగ్గ కుండా పవన్ మీద  విమర్శలను తార స్థాయికి తీసుకోని వచ్చాడు.  అయితే కత్తి సంధిస్తున్న ప్రశ్నల పోటు చాలా మందిని ఆలోచింపచేస్తుంది.

Image result for kathi mahesh and pawan kalyan

ఇది పవన్ అభిమానులుకు కొంచెం చేదుగా అనిపించ వచ్చు కానీ ఒక కామన్ మ్యాన్ గా ఆలోచిస్తే మాత్రం కత్తి సంధిస్తున్న ప్రతి ప్రశ్న కరెక్ట్ గా అనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే తన ప్రశ్న లకూ ఎవరి దగ్గర సమాధానం లేకపోవడం. నిజంగా పవన్ ఇప్పుడు చేస్తున్న పార్ట్ టైం రాజకీయాలు గురించి, చంద్ర బాబు నాయుడు కి మరియు పవన్ కి మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ గురించి ప్రతి పక్షం వారు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అయితే మామూలు గా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి నట్లైతే మనకు అర్ధం అవుతుంది.

Image result for kathi mahesh and pawan kalyan

 ఎందుకంటే ఒక పక్క టీ డి పి ఘోరంగా విఫలమవుతుంటే పవన్ ప్రశ్నించక పోవడం. అదే విషయాలను కత్తి మహేష్ సంధించాడు. కత్తి మహేష్ ప్రతి ప్రశ్న లో ఖచ్చితత్వం ప్రదర్శిస్తున్నాడు. ప్రతి మాట సూటి గా దింపుతున్నాడు. అందుకే అతనికి చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. అయితే జనసేన నుంచి అతని ప్రశ్న లకూ సమాధానం చెప్పలేక విలవిల లాడుతున్నారు. ఇప్పుడు పూనం కౌర్ మేటర్ తో ఇది తారా స్థాయి కి చేరింది .  దీనితో కత్తి పోట్లు పవన్ రాజకీయానికి గట్టిగా గుచ్చు కుంటున్నాయని అందరు చెప్పుకుంటున్నారు. కత్తి మహేష్ చెప్పినట్లు పవన్ ఫ్యాన్సు మాట్లాడే ప్రతి మాట పవన్ రాజికియ సమాధి కి కారణమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: