పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, జిల్లా పరిషత్ ఛైర్మెన్ బాపిరాజు వర్గంపై మంత్రి తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఆ మద్య గజల్  శ్రీనివాస్ విషయంలొ జోక్యం చేసుకొని మళ్లీ యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.  గజల్ శ్రీనివాస్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి మాణిక్యాలరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఏపీలోని తాడెపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... "గజల్ శ్రీనివాస్‌ను సమర్థిస్తూ నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. నా వ్యాఖ్యలపై కొందరు నన్ను కలిశారు. ఆ వీడియోలు చూసిన తర్వాత నేను షాకయ్యా. నేను మాట్లాడిన దానికి సిగ్గు పడుతున్నా అన్నారు. 

నన్ను కట్ చేస్తే మిమ్మల్ని కట్ చేస్తా

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ-బీజేపీ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తాడేపల్లిగూడెం మండలంలోని రామన్నగూడెంలో  ‘జన్మభూమి’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ ముళ్లపూడి శ్రీనివాస్ వర్గంపై ఏపీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు మండిపడ్డారు.  మూడున్నర సంవత్సరాల పాటు సహనంతో ఉన్నా. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కలిసి పని చేస్తున్నాం. నియోజకవర్గాన్ని కేంద్రం నిధులతోనే అభివృద్ధి చేశానని..తన స్వంత నియోజకవర్గంలోనే ఏ కార్యక్రమానికి ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. సహనానికి ఓ హద్దు ఉంటుందంటూ మగాడినై రెచ్చిపోతా అంటూ మాణిక్యాలరావు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు.

నేను శత్రువునా

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. నన్ను అడ్డుకోవాలని చూస్తే మగాడినై రెచ్చిపోతా’ అని మండిపడ్డారు. టిడిపి నేత జిల్లా పరిషత్ ఛైర్మెన్ ముళ్ళపూడి బాపిరాజు వర్గీయులపై మంత్రి మాణిక్యాలరావు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. మూడేళ్ళుగా తాను అన్నింటిని సహనంగా భరిస్తున్నానని మాణిక్యాలరావు చెప్పారు.నన్ను తన స్వంత నియోజకవర్గంలోనే కట్ చేయాలని భావిస్తున్నారని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు.
Image result for మాణిక్యాలరావు
 నన్ను కట్ చేయాలని చూస్తే ఏపీనే కట్ చేస్తానని మంత్రి మంత్రి మాణిక్యాలరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సహనానికి కూడ హద్దు ఉంటుందని మంత్రి చెప్పారు.  ఈ ఊరులో ఏదైనా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారా? నేను ఏమైనా శత్రువునా? ప్రతి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రిగారి పక్కన కూర్చునే వ్యక్తిని నేనంటూ మంత్రి మాణిక్యాలరావు జన్మభూమి సభలో స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: