దేశం మొత్తం నివ్వెరపోయిన సంఘటన ఇది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా న్యాయస్థానాల్లో న్యాయం లభిస్తుందనేది ప్రజల నమ్మకం. అయితే అత్యున్నత న్యాయస్థానంలోనే అన్యాయాలు జరుగుతున్నాయంటూ సాక్షాత్తూ తీర్పు చెప్పే న్యాయమూర్తులే వ్యాఖ్యానించిన వేళ ఇది. సుప్రీంకోర్టులో వ్యవహారాలు సక్రమంగా లేవంటూ నలుగురు జడ్జిలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త సంచలనం. సుప్రీంకోర్టు చరిత్రలో ఇదో సరికొత్త సంప్రదాయం.

Image result for supreme court of india

దేశంలో ఉన్నత శిఖరాన నిలిచిన సర్వోన్నత న్యాయస్థానంలో పాలనాలోపం బయటపడింది. భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమకు న్యాయం జరగడంలేదంటూ మీడియా ముందుకొచ్చారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా దేశంలో న్యాయవ్యవస్థ ఉలిక్కిపడేలా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటకొచ్చారు. తమ ఆవేదనను ప్రజలకు చెప్పుకునేందుకు వచ్చామన్నారు.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్.. సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తిపైనే తమ అసంతృప్తి వ్యక్తపరిచారు. గత్యంతరం లేక వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మీడియా ముందుకొచ్చామని వెల్లడించారు..

Image result for supreme court of india

సుప్రీంకోర్టులో గత కొంత కాలంగా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వివరించారు. దేశానికే తలమానికంగా ఉండాల్సిన సుప్రీం కోర్టు నిర్వాహణ దాని ప్రమాణాలకు తగినట్లుగా లేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఆత్మలు అమ్ముకునే పరిస్థితి రాకూడదనే బయటకొచ్చామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేయడం మినహా తమకు మరోమార్గం లేదంటూ సుప్రీం కోర్టు జడ్జీలు వ్యాఖ్యానించారు.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో కోలీజియం తీరుపై సీనియర్ న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా జరిగిన నియామకాల విషయంలో.. ప్రధాన న్యాయమూర్తితో చర్చించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు.. సుప్రీంకోర్టు పవిత్రత నిలబడకపోతే ప్రజాస్వామ్యానికి చేటు అని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి కావాలంటూ నర్మగర్భంగా తమ డిమాండ్ ను వెల్లబుచ్చారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి.. స్వతంత్రంగా వ్యహరించడంలేదంటూ చెప్పకుండా చెప్పుకొచ్చారు..

Image result for supreme court of india

సుప్రీంకోర్టులో గత కొంతకాలంగా ఆదిపత్యం కోసం పోరు నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు సంబంధించిన వైద్య కళాశాలల లైసెన్స్ రద్దు కేసు విషయంలో అప్పుడు పెద్ద రగడే జరిగింది. ఆ వ్యవహారంలో మెడికల్ కాలేజీల కుంబకోణంలో న్యాయమూర్తులకు సైతం అవినీతి మరకలంటడంతో కేసు సుప్రీం కోర్టుకు చేరింది. నవంబర్ నెలలో ఈ వైద్య సీట్ల కుంభకోణం అంశం సుప్రీం కోర్టు జడ్జి.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముందుకు వచ్చింది. పిటిషన్ ను స్వీకరించిన జస్టిస్ చలమేశ్వర్.... సుప్రీం కోర్టులోని ఐదగురు అత్యంత సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి కేసును అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ అత్యంత సీనియర్ జడ్జిల జాబితాలో సహజంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పేరు ముందుండాలి. ఆ తర్వాత జాస్తి చలమేశ్వర్ పేరుండాలి. కానీ ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు సంబంధించిన కేసు విషయంలో జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉన్నాయన్న ఆరోపణలు ఉండడంతో ఏర్పాటు చేయబోయే పంచసభ్య ధర్మాసనంలో ఆయన ఉండకూడదని ఆ కేసు వేసిన పిటిషనర్ కోరారు.. పిటిషనర్ కోరిన ప్రకారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందే ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టు కేసును వేరే ధర్మాసనానికి అప్పగించాలని చీఫ్ జస్టిస్ నుంచి జస్టిస్ చలమేశ్వర్ కు ఆదేశాల ముసాయిదా అందింది. అయినా CJ ఆదేశాలు పక్కన పెట్టి... ఆర్టికల్ 145(3) ప్రకారం ప్రత్యేక ఆదేశాల ద్వారా చీఫ్ జస్టిస్ లేకుండానే ధర్మాసనం ఏర్పాటు చేసి, సిట్ విచారణపై తేల్చవచ్చంటూ జాస్తి చలమేశ్వర్ ఆదేశాలిచ్చారు. ఈ పరిణామమే న్యాయమూర్తుల మధ్య అధికార పరిధి వివాదానికి ఆజ్యం పోసింది..

Image result for supreme court of india

జాస్తి చలమేశ్వర్ ఆదేశాలను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా కొట్టేశారు. ధర్మాసనాల ఏర్పాటు, వాటికి కేసుల అప్పగింత పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఒక ద్విసభ్య ధర్మాసనం స్వయానా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అధికారాలను ఎలా లాక్కుంటుందని ఐదురుగు సభ్యుల ధర్మాసనం విస్తుపోయింది. అత్యంత సీనియర్లు అని నిర్థిష్టంగా ప్రస్తావించడమంటే మమ్మల్ని అవమానించడం కాదా అంటూ మరో న్యాయమూర్తి అప్పట్లో ప్రశ్నించారు. ఆ వైద్య సీట్ల కుంబకోణం విషయంలో సర్వోన్నత న్యాయస్థానంలో పాలనాపరంగా ఇబ్బందులున్నాయన్న అంశం బయటపడింది. ఇప్పుడు ఏకంగా నలుగురు  సుప్రీం కోర్టు జడ్జిలు స్వయంగా బైటకొచ్చి.. ప్రధాన న్యాయమూర్తిపై తిరుగుబాటు చేశారు. న్యాయవవస్థకు సంబంధించినంత వరకు బయటకొచ్చి మాట్లాడడం అనేది ఇప్పటి వరకు దేశం ఎరుగనిది. ప్రజాస్వామ్య వ్యవస్థను సవ్యంగా నిడిపించాల్సిన న్యాయస్థానాల్లోనే అవకతవకులు, ఆధిపత్య పోరు బయటపడితే... దేశం ఏదిశగా పయనిస్తుందో అనే భయం ప్రతి ఒక్కరిలో మొదలవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: