ప్రతి పార్టీ లో ఫైర్ బ్రాండ్స్ కొంత మంది ఉంటారు. వారికి జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది వీరి విషయం లో పార్టీ అధినేత సీనియర్ లీడర్స్ కంటే వీరికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అయితే వైసీపీ పార్టీలో కూడా అటువంటి లీడర్స్ ఉన్నారని చెప్పవచ్చు. అనునిత్యం జ‌నంలో ఉంటూ అధికార‌పార్టీపై మాట‌ల‌దాడిని చేస్తూ సొంత‌పార్టీలో ఫైర్ బ్రాండ్ లుగా నిలిచిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని,నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్,మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే,న‌గ‌రి ఎమ్మెల్యే రోజా…ఇప్పుడీ న‌లుగురు ఎమ్మెల్యేలే జ‌గ‌న్ కు పనికొచ్చే అంబాసిడ‌ర్లుగా క‌నిపిస్తున్నారు.అందుకే ఈ న‌లుగురికి కీల‌క‌మైన ఆదేశాలు ఇచ్చాడ‌ట జ‌గ‌న్.

Image result for kodali nani

చంద్ర‌బాబు స‌ర్కార్ ను ఎక్క‌డిక‌క్క‌డ ఎండ‌గ‌డుతూ యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా కార్య‌క్ర‌మాలు చేయాల‌ని అనిల్ యాద‌వ్ కు, ప్ర‌భుత్వం ఫెయిల్ అవుతున్న ప్ర‌తీచోట కోర్టుకీడ్చేలా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి, తెలుగుదేశం పార్టీనీ,ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ టీడీపీ మైలేజీని డ్యామేజ్ చేసేలా కొడాలి నానికి,ఇకపోతే మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ,యువ‌మంత్రి లోకేశ్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ, చంద్ర‌బాబును ఇర‌కాటంలో ప‌డేసేలా రోజాకు ప్ర‌త్యేక‌మైన ప‌నులు అప్ప‌జెప్పిన‌ట్లు స‌మాచారం.

Image result for anil kumar yadav

పార్టీలో వీరితోపాటు అనేక‌మంది సీనియ‌ర్ నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఏపీలో వీరి న‌లుగురికి ఫాలోయింగ్ బాగా ఉన్నందున స్పెష‌ల్ ప‌వ‌ర్స్ ఇచ్చిన‌ట్లుగా పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి.కానీ అన్ని సందర్భాల్లో వీళ్లు న‌లుగురే రంగంలోకి దిగితే పార్టీకి ప్ర‌యోజ‌నం క‌న్నా డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రుగుతుందని భావించిన సంద‌ర్భాల్లో సీనియ‌ర్ల‌యిన బొత్స‌,అంబ‌టి,పార్థ‌సార‌ధి,ఉమ్మారెడ్డి లాంటి నాయ‌కులు అటాక్ చేయాల‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రి జ‌గ‌న్ మెచ్చిన ఈ న‌లుగురు నేత‌లు పార్టీని గ‌ట్టెక్కిస్తారో లేక న‌ట్టేట ముంచుతారో అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: