కర్ణాటక లో అప్పుడే ఎన్నికల ఫీవర్ మొదలైంది అని చెప్పవచ్చు. ఇప్పటి నుంచే రెండు పార్టీ లు తమ, తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. అయితే బిజెపి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ని యోగి ఆధిత్య నాద్ ను రంగం లోకి దింపింది.  సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే ఈ తరహా పరిణామాలకు కారణమని చెప్పక తప్పదు. దక్షిణాది రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ... దక్షిణాదిన బలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక ఒక్కటి మాత్రమే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అడుగు  పెట్టేందుకు కూడా అవకాశం చిక్కడం లేదు. కర్ణాటకలో అయితే బీజేపీ ఏకంగా ఓ దఫా అధికారం కూడా చేపట్టింది.

Image result for siddaramaiah and yogi adityanath

అలాంటి రాష్ట్ర అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండటం - అది కూడా సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా జరుగుతుండటంతో నిజంగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని - వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు విజయబాట వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా పక్కా ప్రణాళిక రచించిన బీజేపీ... కన్నడ నాట బరిలోకి తన తురుపు ముక్కగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను బరిలోకి దించేసింది.  ఇప్పటికే పలు దపాలుగా కర్ణాటకలో పర్యటించిన యోగీ... నేరుగా కర్ణాటక సీఎం - మిస్టర్ క్లీన్ ఇమేజీని ఇటీవలే కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్యపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

Image result for siddaramaiah and yogi adityanath
అయితే యోగీ విమర్శలపై సిద్దూ కూడా స్పాంటేనియస్ గానే స్పందిస్తూ ఉన్నారని చెప్పక తప్పదు. మొత్తంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు యోగీ వర్సెస్ సిద్దూగా మారిపోయాయని చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్నా... ఇటీవల సిద్దూ చేసిన వ్యాఖ్యలకు అప్పటికప్పుడే పవర్ పంచ్ ల్లాంటి తూటాలను పేల్చేసిన యోగీ... తాజాగా తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోతో సిద్దూను మరింతగా టార్గెట్ చేశారు. ఈ వీడియోలో ఒక్క సిద్దూను విమర్శించడంతోనే సరిపెట్టని యోగీ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా సెటైర్లు వేశారు. అయినా ఆ వీడియోలో సిద్దూ - రాహుల్ పై యోగీ చేసిన వ్యాఖ్యలేమిటన్న విషయానికి వస్తే...  మాట్లాడితే హిందువునని 
చెప్పుకునే సిద్ధరామయ్య.. తన హయాంలో జరిగే హిందువుల హత్యల గురించి ఎందుకు స్పందించరని యోగీ ప్రశ్నించారు. గత మూడేళ్లలో 12 మంది హిందువులు దారుణంగా హతమయ్యారంటూ బాధితుల ఫోటోలతో సహా వీడియోను విడుదల చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: