భారత దేశంలో గత కొంత కాలంగా నేర ప్రవృత్తి బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.  ఓ వైపు టెక్నాలజీ బాగా పెరిగిపోతుందని ఢంకా బజాయించి చెబుతున్నా..కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మూఢ నమ్మకాలు, ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు, అధికార దురహంకారం అలాగే కొనసాగుతున్నాయి.  ఇక భారత దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో మహిళలపై, యువతులపై చివరకు చిన్నారులపై కూడా అత్యాచారాలు, హత్యలు కొనసాగిస్తున్నారు కామాంధులు. 

తాజాగా  పంచాయతీ ఎన్నికల్లో తమకి ఓటు వేయలేదనే కోపంతో ఓ కుటుంబంలోని బాలికపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..ప్రేమలాల్ అనే వ్యక్తి భార్య ఇటీవల రాంచీలోని లిట్టిపరాలో సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయింది. దీనికి కారణం ఓ కుటుంబం అని భావించిన ప్రేమలాల్.. తన తమ్ముడు, మరో ఇద్దరితో కలిసి ఆ ఇంటిలో ఉండే 13 ఏళ్ల బాలికని ఈ నెల 8న కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.  తర్వాత తన గుట్టు ఎక్కడ బయట పడుతుందో అని ఆ బాలికను దారుణంగా హత్య చేసి అడవిలో పడవేశారు.

మరోవైపు బాలిక తండ్రి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రంగంలోకి దిగిన పోలీసులు విచారకరస్థితిలో మృత‌దేహం కనబడింది. కేసు విచారణలో భాగంగా ఇటీవల ఎన్నికల సమయంలో ప్రేమలాల్ సోదరులతో గొడవ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల్ని గాలించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.  పోలీసుల విచారణలో ప్రేమ్‌లాల్, శ్యామ్యూల్, కత్తి హన్షడ, శిశు హన్షడ నేరాన్ని ఒప్పుకున్నట్లు ఎస్పీ శైలేందర్ వెల్లడించారు.

అయితే ప్రధాన నిందితుడి భార్య ఇటీవల స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి.. స్వల్ప తేడాతో ఓడిపోయింది. దీనికి కారణం గ్రామంలోని ఓ కుటుంబం తమకి వ్యతిరేకంగా ఓటు వేయడమేనని ఆగ్రహించిన అభ్యర్థి భర్త.. తన తమ్ముడితో కలిసి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: