తెలంగాణా ఉద్యమంలో అత్యంత కీలకంగా పని చేసిన జేఏసీ ఛైర్మెన్ ప్రొఫిసర్ కోదండరాం...పార్టీ పెట్టనున్నారు అంటూ గత కొంతకాలం నుంచీ వార్తలు గుప్పు మంటున్నాయి..అయితే దానికి అనుగుణంగానే చక చకా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోందట..పార్టీకి సంభందించిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అన్నీ ఇప్పుడు ఢిల్లీ లో వేగంగా జరుగుతున్నాయి అని టాక్ కూడా ఉంది.. అంతేకాదు జేఏసీ విద్యార్ధి సంఘాల నుంచీ అనేక మంది పార్టీ పెట్టాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు ని తెలుస్తోంది...ఈ పరిణామాల నేపధ్యంలో ఫిబ్రవరిలో 3 ,4 వ తరీకులలో జరిగే జేఏసీ సమావేశంలో పార్టీ ఏర్పాటు గురించి కోదండరాం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.

 Image result for kODANDA RAM SRINIVAS

అయితే కోదండరాం కొత్త పార్టీలోకి ఉద్యమ నేతలకే చోటు ఉంటుందని..మిగిలిన వారికి మాత్రం వారి వారి రాజకీయ నేపధ్యం బట్టి ప్రవేశం ఉంటుందని తెలుస్తోంది..టీఆర్ఎస్ నుంచీ కూడా భారీగానే వలసలు కోదండరాం పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..ముఖ్యంగా పోరాట సమయంలో ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎంతో మందికి కేసీఆర్ మొండి చేయి చూపించారు అని వారందరికీ పార్టీలోకి ఆహ్వానం ఉంటుందని టాక్..అయితే టీఆర్ఎస్ నుంచీ వచ్చే వారిలో ముఖ్యంగా వినపడుతున్న పేరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్.. ఈ మధ్య శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి మీద అలాకగా ఉన్నారట..పార్టీ లో తనకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు..ఉద్యమనేతగా వచ్చిన నన్ను పట్టించుకోవడం లేదు..ఉద్యమానికి సంభందం లేని ఎంతో మందిని మంత్రులుగా చేస్తున్నారు అంటూ ఫైర్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి..టీఆర్ఎస్ లో జరుగుతున్న ఈ పరిస్థితులని చూస్తుంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అంటూ శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.

 Image result for kcr

అంతేకాదు తాజాగా జరిగిన నాయిని ఎపిసోడ్ కి కూడా శ్రీనివాస్ గౌడ్ మద్దతు ఇవ్వడం..అంతకు ముందు మంత్రుల మధ్య గొడవలు..ఎంపీ తో పడక పోవడం..తానూ మాట్లాడే ప్రతీ సారి ఉద్యమంలో ఎంతో పని చేశాను అంటూ చెప్పడం చూస్తుంటే శ్రీనివాస్ గౌడ్ వ్యవహార శైలి మీద కేసీఆర్ కి డౌట్ ఉందొ లోదే కానీ తెలంగాణా ప్రజలకి మాత్రం శ్రీనివాస్ గౌడ్ కోదండరాం కొత్త పార్టీలోకి వెళ్ళిపోతారు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. అయితే సినివాస్ గౌడ్ వస్తాను అన్నా సరే కోదండరాం ఆహ్వానించే సాహసం మాత్రం చేయరు అని టాక్ కూడా ఉంది..

 Image result for trs

ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ తన నియోజకవర్గం పరిధిలో సాయం కోసం వచ్చిన వారికి నువ్వు ఏ పార్టీకి చెందిన వ్యక్తివి అంటూ ప్రశ్నించి అప్పుడు పని చేస్తున్నారట..టిఆర్ఎస్ అయితేనే అక్కడ పనులు జరుగుతాయి లేదంటే నై నై అంటున్నారట. టీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే పనులు అంటూ శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న చెప్పడంతో సదరు ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. మరి అలాంటి ఉద్యమ నేతలని కోదండరాం ఏ మాత్రం పార్టీలోకి ఆహ్వానించరు అంటున్నారు. మరి శ్రీనివాస్ గౌడ్ నిజంగానే పార్టీ మారుతారా లేక ఇవన్నీ ఊహాగానాలకే  పరిమితం అవుతాయా అనేది త్వరలోనే తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: