సౌత్ ఇండియాలో విలక్షణ నటుడిగా కమలహాసన్ కు మంచి పేరు ఉంది. నవరసాలు పండించడంలో కమల్ హాసన్ మించినవారు లేరు అని సౌత్ ఇండస్ట్రీస్ కి చెందిన చాలామంది సీనియర్ నటులు అంటుంటారు. కమలహాసన్ నటనలోనే కాదు నిజజీవితంలో కూడా ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్ననాడు. ఇంతకముందు  తన రాజకీయ అరంగేట్ర ప్రకటనతో తమిళనాడు రాజకీయ నాయకులకు వణుకు పుట్టించాడు. జయలలిత మరణం తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని మరియు రాష్ట్రాన్ని కాపాడాలని ప్రయత్నంతో రాజకీయ పార్టీ పెడుతున్నాను అంటూ ప్రకటించాడు.

అయితే ఇదే సమయంలో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పార్టీ పెట్టనున్నాడు అని తెలిసి రజనీ పై కూడా విమర్శలు దిగి తమిళనాడులో అందరూ చీదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. మొన్న జరిగిన ఆర్కేనగర్ ఉపఎన్నికల విషయంలో కూడా కమలహాసన్ అనవసరమైన వ్యాఖ్యలు చేసి ఆ ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే తాజాగా కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు, తన పార్టీ స్థాపించక ముందు తమిళనాడు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయాలని కమల్ అనుకుంటున్నట్లు సమాచారం..దీనికి సంబంధించి కమల్  ఇటీవల ఓ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.

‘‘తమిళనాడులో ప్రస్తుతం అవినీతి పాలన నడుస్తోంది. ప్రస్తుత పరిణామాలను ప్రజలకు వివరించి.. వారి సమస్యలను తెలుసుకునేందుకే నా పర్యటన. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా. పర్యటన వివరాలను ఆనంద్‌ వికటన్‌ తదుపరి సంచికలో వెల్లడిస్తా’’ అవినీతిని అంతమొందించే పనిలో ఉన్నాను అని దానికి తగ్గట్టుగానే మైయామ్‌ విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటికే చాలా ఫిర్యాదులు మాకు అందాయని..త్వరలోనే అందరి బండారం బయటపెడుతాను అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: