జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ మనుగడ కు బీటలు  పడే పరిస్థితి నెలకొంది. ఇంకా రాజకీయాలలో పూర్తిగా రాకముందే ఎన్నికలలో పోటీ చేయకముందే ఇటువంటి పరిస్థితులు గుండా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వెళ్ళడం నిజంగా మరో మినీ ప్రజారాజ్యం తలపిస్తుంది  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు విషయమేమిటంటే పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం అజ్ఞాతవాసి సామాన్య ప్రేక్షకులు నే కాక అభిమానులను తీవ్ర నిరాశపరిచింది బాక్సాఫీస్ దగ్గర బోల్తపడింది. భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా ఆడకపోవడం తో పవన్ కళ్యాణ్ పునరాలోచన మొదలైందన్న ప్రచారం ఊపందుకుంది.

మొన్నామధ్య అజ్ఞాతవాసి సినిమా విడుదల కాకముందు పవన్ కళ్యాణ్ సినిమాలు ముగిస్తాడు, పూర్తికాలం రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తాడు అని జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రకటించడం జరిగింది. అయితే ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అదికూడా మళ్లీ త్రివిక్రమ్ తో చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతి లో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇద్దరు బడా హీరోల సినిమాలు ఒకటి ఎన్టీఆర్, మరొకటి వెంకీతో.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ప‌వ‌న్‌తో ఓ సినిమా తెర‌కెక్కించే ఆలోచ‌న‌లో త్రివిక్ర‌మ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌స్థానం మ‌రింత ఆల‌స్యం కావ‌డం ఖాయం. ఇదే నిజమైతే పవన్ రాజ‌కీయ జీవితం కొంత డైలామాలో ప‌డిన‌ట్లే. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తామ‌ని జ‌న‌సేన అధినేత చెబుతున్నారు. ఆ మాట ప్ర‌కారం ఇప్ప‌టి నుంచి రాజ‌కీయాల్లో క్రీయాశీలంగా ఉంటేనే ఏడాదిన్న‌ర త‌ర్వాత జ‌రిగే ఎన్నిక‌ల‌కు ఆయ‌న సిద్ధం అవుతున్న‌ట్లు భావించాలి. లేకుంటే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల‌లో జ‌న‌సేన పోటీపై నీలి నీడ‌లు క‌మ్ముకున్న‌ట్లే. ఎన్నిక‌లంటే చిన్న విష‌యం ఏమీ కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: