తమిళనాడులో కొంత కాలంగా రాజకీయల్లో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి.  జయలలిత మరణం తర్వాత సీఎం పదవి కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు చోటు చేసుకున్నాయి.  జయలలిత నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.  దీంతో ఆమెకు నమ్మిన బంటు అయిన పళని స్వామికి సీఎం పదవి దక్కేలా చేసింది.  ఇదిలా ఉంటే కొన్ని రోజుల్లో పళని స్వామి,  శశికళకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. 

శశికళ ఆమె బంధువులకు పళని స్వామి యాంటీగా మారిపోయారు.  అంతే కాదు చిన్నమ్మ శత్రువైన పన్నీరు సెల్వంతో స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నారు.  అయితే అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ మొన్నామద్య జరిగిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలిపుపొందారు.   అయితే స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో మేనత్త శశికళ, ఆమె వర్గీయులు, అన్నాడీఎంకే బహిష్కృత నేతలతో కలిసి కొత్తపార్టీని ఏర్పాటు చేస్తారని ఉపఎన్నిక ముగిసిన అనంతరం అందరూ భావించారు.
Image result for palani swamy pannir selvam
తాజాగా  టీటీవీ దినకరన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొత్తపార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం పుదుచెర్రిలో మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.  ఇప్పటికే మేనత్త శశికళకు జైలుపాలయ్యింది. మరోవైపు రెండాకుల గుర్తు అన్నాడీఎంకే దక్కింది. ఈ క్రమంలో శశికళ-దినకరన్‌ వర్గంపై వేటు వేసి.. వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆ పార్టీ నుంచి వచ్చిన బహిష్కృత నేతలంతా తనవైపు ఉన్నారే తప్ప వారికి ఎటువంటి పదవులు లేవు.
Image result for దినకరన్
ఆ నేతలను కనీసం ఆయా నియోజకవర్గాల్లో ప్రజలెవరూ ప్రజాప్రతినిధులుగా గుర్తించని పరిస్థితిలో ఉన్నారు. ఈ మేరకు మంగళవారం శశికళ అనుచరులు, కీలక వ్యక్తులు, పుదుచెర్రిలోని తన మద్దతుదారులతో దినకరన్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తమిళనాడులో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలో కెళ్లా డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా ఉన్నాయి.
Image result for దినకరన్
మరోవైపు తమిళనాడులో ఎలాగైనా సరే పాగా వేయాలని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ రెండు పార్టీలు పొత్తుల విషయమై ప్రాంతీయ పార్టీల అధినేతల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాయి.ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయిన నేపథ్యంలోనే దినకరన్‌ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు స్పష్టమౌతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: