ఉమ్మడి  రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పక్షపాతం చూపిస్తున్నారు అంటూ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పార్టీల నాయకులు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ మధ్య ఆంధ్ర రాష్ట్ర బిజెపి నాయకుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవల రాష్ట్రానికి సంబంధించిన నాలా బిల్లు ఆమోదం విషయంలో కూడా గవర్నర్ కావాలని జాప్యం చేస్తున్నారని ఏపీ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారని వంటి ఆరోపణలు చేయడం జరిగింది.

అంతేకాకుండా  తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన  కాంగ్రెస్ నాయకులు కూడా  గవర్నర్ నరసింహన్ మిదా విమర్శలు ఆరోపణలు చేయడం జరిగింది. అయితే తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎంపీ కంభంపాటి హరిబాబు కూడా నోరు విప్పారు. రాష్ట్రానికి కొత్త గవర్నర్ కావాలంటూ డిమాండ్ చేశారు. అడగడమే కాదు కార్యాచరణ కూడా మొదలు పెట్టారు. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఇదే విషయమై హరిబాబు లేఖ కూడా రాశారు.

నవ్యాంధ్రకు కొత్త గవర్నర్‌ను నియమించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.మరోపక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కూడా ప్రస్తుత గవర్నర్ పై ఆగ్రహంతో ఉన్నారు.ఆయన తెలంగాణ పక్షపాతిగా వుంటున్నారని వంద శాతం నమ్ముతున్నారు. ఈ తరుణంలో కేంద్రం రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమించడానికి సిద్ధమయిందని ఆ విషయం తెలియడంతోనే బీజేపీ నేతలు గవర్నర్ కావాలంటూ డిమాండ్లు మొదలు పెట్టారని తెలుస్తోంది. తాము అడగడంతోనే కేంద్రం కదిలి గవర్నర్ ని నియమించిందని చెప్పుకోవాలన్నది వారి ప్లాన్ గా తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: