ఈ మాటలు అంటుంది ఎవరో కాదు..వైద్య పరిశోధకులు..అవును తుమ్ము ఆపుకోవడం వల్ల గొంతు లోపల గాయం కావచ్చు, చెవిలో ఉండే కర్ణభేరి పగిలిపోవచ్చు, లేదా మెదడులో ఉండే నరాలు ఉబ్బిపోయి ప్రమాదం సంభవించొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.   ఎక్కువ చాలామంది ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా తుమ్మితే అది అశుభమని భావిస్తారు. అలాంటప్పుడు ఆగి కాస్త మంచినీళ్ళు తాగి కాసేపు కూర్చుని వెళ్ళమంటారు మన పెద్దవాళ్ళు.
sneezing
కొంతమందైతే ఏదైనా విషయం మాట్లాడినప్పుడు ఎవరైనా తుమ్మితే సత్యం అంటారు. మరి కొంతమంది ఏదైనా శుభకార్యం గురించి ఆలోచించినప్పుడు తుమ్మితే ఆ పనిని వాయిదా వేస్తారు. ఇలా చాలామంది చాలారకాలుగా సెంట్మెంట్స్ని చూపిస్తారు. మనం తుమ్మినప్పుడు పెద్దవాళ్ళు చిరంజీవ..చిరంజీవ, శ్రీరామ రక్ష అని దీవిస్తారు. 34 ఏళ్ల వ్యక్తి ఇలాగే తుమ్ము ఆపుకోవడం వల్ల ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ ప్రాంతంలో ప్రాణాల మీదకు తెచ్చుకుని ఆస్పత్రిలో ఎమర్జెన్సీలో చేరాల్సి వచ్చింది.
Related image
అతడి మెడ వాచిపోయి విపరీతంగా నొప్పి రావడంతో ఆస్పత్రికి వచ్చాడు. తుమ్ము ఆపుకోడానికి ముక్కును అదిమిపెట్టేవాడినని, ఆ తర్వాత మెడలో ఏదో ఉబ్బినట్లు అనిపించి నొప్పి మొదలైందని ఆ వ్యక్తి చెప్పాడు. వెంటనే వైద్యులు అతడికి సీఏటీ స్కాన్ తీస్తే.. తుమ్ము బలానికి అతడి గొంతు వెనక వైపు తీవ్రమైన గాయం కావడంతో పాటు నరాలు కూడా ఉబ్బాయి.
Image result for sneezing
మొత్తానికి అతనికి ఎలాగో అలా వైద్యం చేసి ఇంటికి పంపించారు.  అయితే తుమ్ము వచ్చినపుడు  ఆపుకోడానికి ముక్కు నొక్కిపెట్టడం, మూసేసు కోవడం లాంటివి చేయడం చాలా ప్రమాదకరమని, అలా చేయకుండా తుమ్ము వచ్చినపుడు తుమ్మేయడమే మంచిదని వైద్యనిపుణులు హెచ్చరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: