దేశం మొత్తం మీద విద్యా వ్యవస్థ ఎలా ఉందో తెలియదు కాని అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని నిరూపించే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ ఘటన నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో స్నాతకోత్సవ కార్యక్రమంలో జరిగింది. బంగారు పతకం అందుకున్న ఒక విధ్యార్థి మాటలకు మంత్రి నివ్వెరపోయారు.


వివరాల్లోకి వెళితే ట్రిపుల్ ఐటీ లో జరిగిన  స్నాతకోత్సవ సభకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకి ఆయా విభాగాల ప్రకారం బంగారు పతకాలు అందించారు. స్నాతకోత్సవ కార్యక్రమ అనంతరం మంత్రి గంటా తన విశ్రాంతి గదికి చేరుకున్నారు. మెకానికల్ బ్రాంచి విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన కొండ్రు శివకుమార్ అనే విధ్యార్థి అక్కడికి చేరుకొని ఆయనతో మాట్లాడుతూ మీరిచ్చిన గోల్డ్ మెడల్ మా ప్రొఫెసర్ల వల్ల రాలేదు. సీనియర్లు అందించిన సలహాలు పాటించడం,నేను తయారు చేసుకున్న ప్రణాళికతో కష్టపడి చదవి బంగారు పతక గ్రహీత అయ్యానని చెప్పాడు. అంతేగాక ట్రిపుల్ ఐటీలో విద్యా బోధన ఎంత నాసిరకంగా ఉందో బయటపెట్టేశాడు.


ఉన్నట్టుండి అతను అలా చెప్పడంతో షాక్ అవ్వడం ఆయన వంతయ్యింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మంత్రి తన ఫోన్ నెంబరు ఇస్తానని, తర్వాత తనతో ఫోన్ లో వివరంగా  మాట్లాడమని విద్యార్థికి సూచించారు. అయితే మంత్రి గంటా, బంగారు పతాకధారి శివకుమార్ తో  కాసేపు చర్చించారు. మంత్రితో ఏం చర్చించినది శివకుమార్ మీడియాకు తెలియజేసేందుకు  ఇష్టపడలేదు. 


కాగా ఊహించని రీతిలో మంత్రి దృష్టికి ఒక బంగారు పతక గ్రహీత  చేసిన కంప్లైంట్ వ్యవహారం నూజివీడు ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి షాకింగ్ గా మారింది. ఆ వెంటనే అతను నూజివీడు క్యాంపస్ విద్యార్థి కాదని వేరే క్యాంపస్ నుంచి వచ్చినట్లుగా కప్పిపుచ్చుకొనే  ప్రయత్నం చేసింది. ఇదిలా ఉండగా మంత్రి గంటా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణకు ఆదేశించినట్లుగా ఆయన మీడియాకు  వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: