రాజకీయం..ఈ పదానికి అసలైన అర్థం మన పిల్లలు చదువుకునే పుస్తకాల్లో ఎన్ని పేజీలు ఉంది?. ఒక పాఠం ఉందా?. ఏం చేయాలి ? ఏం చేస్తే సమాజానికి మంచి చేయవచ్చు? అనే రాజకీయాల రైమ్స్ ఎన్ని ఉన్నాయి?. ఈ ప్రశ్నలకి మన సమాజంలో సమాధానాలు ఉన్నా.. ఆచరణలోకి వస్తుందా అనే ప్రశ్న మళ్లీ మొదలువుతూనే ఉంటుంది. 

ఇక అసలు విషయానికి వస్తే రాజకీయాలంటే ఏంటి? ఈ రోజుల్లో ధనం - మద్యం ధారలుగా పారితేనే ఓట్లు వస్తాయి. మంచి తనంతో  రాజకీయాల్లోకి వస్తే పోరాటం మాత్రమే మిగులుతుంది. లేదా ఆ పోరాటంలో దెబ్బలు నాయకుడిని పూర్తిగా మార్చేయగలదు. ఒకటి రాక్షసుడిగా లేదంటే ఓటమిని ఒప్పుకొని తప్పుకునేవాడిలా చేస్తుంది ఈ రాజకీయం.

మరి ఇలాంటి పాలిటిక్స్ లోకి రజినీకాంత్ - పవన్ కళ్యాణ్ వంటి వారు అడుగు పెట్టారు. వీరు వ్యక్తిగతంగా వారికి వీలైనంత వరకు కొంత మందికి మంచి చేశారు అందులో సందేహం లేదు. కానీ పాలిటిక్స్ లో మంచి కన్నా ముందు ఓ మాయ ముఖ్యం. మంచి తనంతో గెలిచినవారు ఉన్నారు. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు చుట్టూ మంచి వాళ్లు లేరు. ఏ పని చేసినా అనుమానం రాకుండా దెబ్బ కొట్టే వాళ్లకు చాలా దారులు ఉన్నాయి. డబ్బు పంచి గెలిచేవాడు అధికారంలోకి సిగ్గు లేకుండా వస్తాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఫ్రీ పబ్లిసిటీ. సమాజానికి అంతా తెలుసు. కానీ ఒక మంచి పొజిషన్ లో ఉన్న రజినీకాంత్ - పవన్ కళ్యాణ్ వంటి వారు ఈ తప్పులు చేయకుండా గెలవగలరా?.
Image result for rajinikanth and pawan kalyan
ప్రస్తుతం నగరాల్లో ఆలోచించి ఓటు వేద్దాం అనుకునే వారు చాలా మంది ఉండవచ్చు. కానీ 65% మంది మాత్రమే ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గ్రామాల్లో దాదాపు 90% శాతం వరకు ఓట్లు నమోదు అవుతున్నాయి. కానీ గ్రామాల్లో ఇంకా ఓటు విలువపై పూర్తి అవగాహన రాలేదు అని ఓ వర్గం వారి మాట. అంతే కాకుండా కులం, వర్గం, మతం, దైవం అనే అంశలతో కూడా ఓట్లు ముడిపడి ఉన్నాయి.  ఎక్కువగా మందు, డబ్బుకు ఆశపడి ఒక రోజు ఆనందంలో ఓటును అమ్మే ప్రక్రియ నడుస్తోంది. మరి ఇలాంటి జఠిలమైన క్రియలకు ఎలాంటి ఆలోచనతో పవన్ - రజినీ ముందుకు సాగుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: