టీడీపీ పరిస్థితి తెలంగాణ లో ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు ఉన్నది ఇప్పడు ఆ పార్టీ పరిస్థితి. ఒక పక్క టీడిపి అధినేత ఓటుకు నోటు కేసు లో ఇరుక్కొని నానా తంటాలు పడుతునాడు. కేసిఆర్ ను ఎదిరించలేక పార్టీ ని బలోపేతం చేయలేక చంద్ర బాబు నాయుడు కు చుక్కలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ పై క‌స్సుమ‌నే మోత్కుప‌ల్లి ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యాడు. అదే కేసీఆర్ పై బుస్సుమ‌ని లేచే రేవంత్ రెడ్డిని ద‌గ్గ‌రుండి సాగ‌నంపాడు. మొన్న‌టిదాకా కారు గుర్తుతో పొత్తు మంత్రాన్ని జపించిన న‌ర్సింహులు అనూహ్యంగా మాట మార్చాడు.
Image result for chandrababu naidu and kcr
పొత్తు లేదు,గిత్తు లేదు, ఏకంగా సైకిల్ ను కార్లో ప‌డేద్దాం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. టీఆర్ఎస్ పార్టీలో విలీనం అవ్వ‌డ‌మే బెట‌ర్ అంటూ చంద్ర‌బాబుకు ఉచిత స‌ల‌హా ఇచ్చాడు. డైరెక్టుగా మీడియాతోనే ఈ మాట‌లు చెప్ప‌డం,ఆ మాట‌ల‌పై స్పందించిన తార‌గాణ‌మంతా మోత్కుప‌ల్లిని క‌డిగిపారేయకుండా తూతూమంత్రంగా వ్య‌వ‌హ‌రించ‌డం,లోకేష్ సైతం మోత్కుప‌ల్లి వ్య‌క్తిగ‌తం అంటూ బ‌దులివ్వ‌డం ఇవ‌న్నీ చూస్తుంటే ఇంకేదో ఉంద‌నే అనుమానం తేట‌తెల్ల‌మ‌వుతోంది. అయితే ఇదంతా చూస్తున్న ఎవరికైనా అనుమానం వస్తుంది. 

Image result for chandrababu naidu and kcr

రేవంత్ రెడ్డి పార్టీ మారితేనే ఘాటుగా స్పందించిన మోత్కుప‌ల్లి,టీడీపీని విలీనం చేయాల‌ని మాట్లాడాడంటే ఆ మాట‌ల వెన‌క బ‌ల‌మైన శ‌క్తి ఉండి తీరాల్సిందే. ఆ శ‌క్తి చంద్ర‌బాబేనా అన్నడౌట్ ప్ర‌తిఒక్క కార్య‌క‌ర్త‌లోనూ క‌లుగుతోంది. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్య‌క్షుడు అయిన చంద్ర‌బాబు, రెండు తెలుగు రాష్ట్రాలు రెండు 
క‌ళ్ల‌లాంటివ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నాడు.కానీ గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న‌కు హైద‌రాబాద్ రావాలంటేనే టైం దొర‌క‌టం లేదు.ఏపీని న‌వ్యాంధ్ర‌గా తీర్చిదిద్ద‌టానికే నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇక ఏపీలో అధికారం చేజార‌కుండా అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న చంద్ర‌బాబుకు తెలంగాణ‌లో పార్టీని ప‌టిష్ట‌ప‌ర‌చ‌డం ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. దానికితోడు తెలంగాణ‌లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న కానుంచి తెలంగాణ రాజకీయాల‌పై మెత్త‌ప‌డ్డార‌నే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: