ఎస్సీ వర్గీకరణ కోసం దీక్ష చేసి జైల్లో ఉన్న మంద కృష్ణ కు ప్రస్తుతం బెయిల్ కూడా దొరకలేదు. అయితే ఇది ఉహించని పరిణామం అని చెప్పవచ్చు. తన పాటికి తానూ శాంతి యుతంగా ఉపవాస దీక్ష చేసిన మంద కృష్ణ తను పర్మిషన్ తీసుకోలేదని ఒకే ఒక కారణం తో జైల్లో పెట్టినారు. దీనితో దళిత సంఘాలు ఒక్క సారిగా భగ్గుమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని అణచివేస్తుందని మంద కృష్ణ మరియు దళిత సంఘాలు ఆరోపిస్తున్నారు.

Image result for manda krishna madiga

కాగా, ఎస్సీ వర్గీకరణ కోసం పార్శీగుట్టలో ఉపవాస దీక్ష ప్రారంభించిన ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఉపవాస దీక్షకు దిగడంతో పోలీసులు మందకృష్ణని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా మందకృష్ణ మాట్లాడుతూ  24 సంవత్సరాల నుంచి ఓపికతో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతిస్తుంది కానీ  పార్లమెంటులో మాత్రం బిల్లు ప్రవేశపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులలో పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Image result for manda krishna madiga

తనను అరెస్ట్ చేసినా కూడా దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనలు శాంతియుతంగా చేయాలని, గురువారం రహదారులపైన శాంతి యుత ఆందోళనలు చేయాలని ఈ సందర్భంగా మందకృష్ణ పిలుపునిచ్చారు. నిర్భందాలతో దళితులకు దూరం కావద్దని.. బాధ్యతతో మా హృదయాలను చురగొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: