పెట్రోల్ ధరలు చూస్తుంటే ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఒక పక్క ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా ఇండియా లో మాత్రమే పెట్రోల్ ధరలు పెరిగినాయి. బహుశా ఇదేనేమో వింత అంటే, ఒక పక్క సామాన్యుడి నడ్డి విడిచి, పన్నుల రూపంలో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నది. అయితే సామాన్యుడు ఎంత భాద పడుతున్నాడని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే మరలా ఇప్పుడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటినాయి. 

Image result for petrol

గ‌త‌ ప‌దిరోజులుగా చూసుకుంటే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 1.21, డీజిల్ ధ‌ర్ 1.92 రూపాయ‌ల చొప్పున పెరిగింది. ఇక గ‌డిచిన 15 నెల‌ల‌ను తీసుకుంటే లీట‌ర్ పెట్రోల్ 11.77,డీజిల్ 13.47 రూపాయ‌లు పెరిగింది.దీన్ని బ‌ట్టి చూసుకుంటే 100 రూపాయ‌ల‌కు లీట‌ర్ పెట్రోల్ అతి త్వ‌ర‌లోనే రాబోతుంద‌నే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అన్ని వ‌స్తువులను జీఎస్టీ ప‌రిధిలోకి తెచ్చిన ప్ర‌భుత్వం పెట్రోల్,డీజిల్ ల‌ను మాత్రం తేలేక‌పోయింది. ఒక‌వేళ జీఎస్టీ ప‌రిధిలోకే గ‌న‌క పెట్రోల్ వ‌చ్చి ఉంటే కేవ‌లం 40 రూపాయ‌ల‌కు లీట‌ర్ పెట్రోల్ ల‌భించేది.

Image result for petrol

ఆ దిశ‌గా ప్ర‌భుత్వం క‌నీసం ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డం దేశ ప్ర‌జ‌ల దౌర్భాగ్యం. ప్ర‌జ‌ల‌కు ఏది అవ‌స‌ర‌మో ఆ రేట్ల‌ను త‌గ్గించండి మ‌హాప్ర‌భో అని వేడుకుంటుంటే,వాటిని ప‌క్క‌న పెట్టి ప‌నికిరాని వాటిపై,అక్క‌ర‌లేని వ‌స్తువుల‌పై రేట్లు త‌గ్గించి గొప్ప‌లు  చెప్పుకోవ‌డం చూస్తుంటే, రాజ‌కీయ నాయ‌కుల‌కు త‌ప్పించి సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థం కాని ప‌రిస్థితి దాపురించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: