జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. కొండగట్టు నుంచి తాను అప్రతిహత రాజకీయ యాత్రను ప్రారంభిస్తానని నిన్న పవన్ కల్యాణ్ ప్రకటన జారీ చేశారు. ఇవాళ మీడియా ముందుకొచ్చిన ఆయన తదుపరి రాజకీయ కార్యాచరణను వెల్లడించారు.

Image result for janasena

          జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలకు సిద్ధమవుతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచే పూర్తిస్థాయిలో రాజకీయం చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే అజ్ఞాతవాసి సినిమా ఆలస్యంకావడంతో ఆయన రాక ఆలస్యమైంది. సంక్రాంతి ముగిసిన తర్వాత జనసేనాని బరిలోకి దిగుతారని ఆయన అనుచరులు చెప్తూ వచ్చారు. అనుకున్నట్టుగానే ఆయన యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేస్తారు.

Image result for janasena

          నిన్నటి ప్రకటనలో కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభిస్తానన్నారు. అయితే కొండగట్టు ఎప్పుడు వెళ్తాననేది చెప్పలేదు. ఇవాళ మీడియా ముందుకొచ్చిన పవన్.. రేపు కొండగట్టు వెళ్తున్నట్టు ప్రకటించారు. ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం తెలంగాణలోని 3 జిల్లాల్లో యాత్ర చేపట్టనున్నట్టు పవన్ చెప్పారు. అయితే అది ఏ రూపంలో ఉంటుందనేది చెప్పలేదు. ప్రజాసమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేపడుతున్నట్టు పవన్ చెప్పారు. బహిరంగసభలు మాత్రం ఉండబోవని తేల్చేశారు.

Image result for kondagattu

          2009 ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఇక్కడ క్షేమంగా బయటపడ్డారు. పైగా ఆంజనేయస్వామి వారి కుటుంబ ఇలవేల్పు. అందుకే కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఇంతకాలం అంశాలవారీగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన యాత్రలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో ప్రారంభించబోతున్నారు. అయితే గతంలో చేసిన పవన్ యాత్రలకు ఇది భిన్నం. ఎందుకంటే గతంలో ఏదైనా సమస్య ఉంటే దానికోసం మాత్రమే ఆయన పర్యటనలు చేశారు. ఇప్పుడు మాత్రం సమస్యల అధ్యయనానికి విస్తృతంగా పర్యటించనున్నట్టు చెప్పారు. మరి తెలంగాణలో పవన్ యాత్ర ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి మరి.!  


మరింత సమాచారం తెలుసుకోండి: