2019 లో కేసిఆర్ ఖచ్చితంగా గెలుస్తాడని సర్వే లు ఘంటాపధంగా చెబుతున్నాయి. కెసిఆర్ కూడాగెలుపు మీద నమ్మకం పెట్టుకున్నాడు. అయితే కేసిఆర్ అనుసరిస్తున్న వ్యూహం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. 2009లో టీడిపి  బలంగా ఉన్నప్పటికీ అపుడే కొత్తగా వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం వల్ల కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇపుడు కెసిఆర్ కూడా  ఆ ధైర్యం తోనే ముందుకెళ్తున్నారు. 
Image result for kcr
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ తో పాటుగా మిగితా పార్టీలు, భవిష్యత్తులో తెలంగాణలో రాబోయే కొత్త పార్టీలు చీల్చితే టీ .ఆర్.యస్  పార్టీ 2019 లో ఆయాచిత లబ్ది పొందటం ఖాయమనే భావన కేసీఆర్ ది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీని సమర్ధవంతంగా ఎన్నికల వైవు నడిపించే నాయకుడు లేకపోవడం, డజనుకు పైగా సీఎం క్యాండేట్లు ఉండడమే  కాంగ్రెస్ కు శాపంగా కేసీఆర్ కి వరంగా మారుతుంది గనుక. ఇక పోతే ముస్లిమ్స్ కి రిజర్వేషన్లని నిజాం గొప్పవాడని పొగడడం వల్ల కొందరు బీజేపీ వైపు మొగ్గే అవకాశం ఉంటుంది. 
Image result for kcr
ఆ మొగ్గే ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ కి నష్టం కల్గించేవే ఇక పోతే కోదండరామ్ భవిష్యత్తులో పార్టీ పెట్టినా లేక ఇంకెవరైనా కొత్త పార్టీ పెట్టినా అవి టీ. ఆర్. యస్ పార్టీకి పడే ఓట్లను చీల్చలేవనే ధీమా కేసీఆర్ ది. ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, ఫలితాలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది, జనసేన తెలంగాణలో ఎలాగూ పోటీ చేయబోతోంది, కోదండరాం పార్టీ కూడా పోటీ చేస్తే యువత ఓట్లన్నీ చీలి చివరికి కాంగ్రెస్ పార్టీ నష్టపోయి తిరిగి టీ .ఆర్ .యస్ పార్టీనే అధికారంలోకి వస్తుందనే ధైర్యం కేసీఆర్ గారిలో స్పష్టంగా కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: