జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఎప్పుడూ లేనంతగా పవన్ కళ్యాణ్ లో ఈమధ్య మార్పు వచ్చింది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ యాత్ర చేయబోతున్న పవన్ కళ్యాణ్ దానికి కావాల్సిన సిద్ధపాటు సిద్ధం చేసుకున్నారు.

ప్రతి రాజకీయ సభలో మరియు సినిమా ఆడియో వేడుకలో నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగానే తన రాజకీయ జీవితంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ లోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తానని చెప్పిన పవన్. మరుసటి రోజే పవన్ ఒక్కసారిగా చర్చిలో ప్రార్ధనలకి వెళ్ళారు. సెయింట్ మేరీస్ చర్చిలో పవన్ కల్యాణ్ దంపతులు ఉదయం ప్రార్థనలు జరిపారు.

పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా చర్చిలకి వెళ్ళడం వెనుక పెద్ద రహస్యం ఏమి లేదు కానీ కరీంనగర్ లో కొండగట్టు ఆంజనేయస్వామి గుడి నుంచీ యాత్ర మొదలు పెడుతాను అని చెప్పిన తరువాత పవన్ పై ఓ హిందూ ముద్ర పడటం..అంత మంచిది కాదని అందుకే సర్వమతమే నా మాతం అనేట్టుగా చర్చిలోకి కూడా వెళ్లి ప్రార్ధనలు చేశారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు త్వరలోనే ముస్లిం సోదరుల దగ్గరకు కూడా వెళ్లి ప్రార్ధనలు చేసే ప్లాన్ ఉందట మరి పవన్ ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో వేచి చూడాలి అంటున్నారు పవన్ సన్నిహితులు.


మరింత సమాచారం తెలుసుకోండి: