వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. జగన్ దారి వెంబడి ఉన్న సామాన్య జనం తో మమేకమై ముందుకు సాగుతు వారి కష్టాలను ఓపికతో వింటూ అడుగులు వేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్ చేపట్టిన పాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 900 కిలోమీటర్ల పూర్తిచేసుకున్న క్రమంలో శ్రీకాళహస్తిలో పెళ్లిమండం సమీపంలో సభావేదిక ఏర్పాటు చేశారు.

పాదయాత్రగా వస్తున్న జగన్ సరిగ్గా నాలుగు గంటలకు సభావేదిక వద్దకు వచ్చేలా వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అయితే జగన్ వేదిక వద్దకు సమీపిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువగా వేదికపైకి ఎక్కడంతో బరువుకు తట్టుకోలేక అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు.

క్షతగాత్రులను వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేదిక కూలిపోవడంతో అక్కడకు చేరుకున్న జగన్ ఓపెన్‌టాప్ వెహికల్‌పై ఎక్కి ప్రసంగించడం గమనార్హం. జరిగిన ప్రమాదంలో వైఎస్సార్సీపీకి చెందిన ఇన్చార్జీ కూడా గాయాలపాలైనట్లు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: