ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ సర్కార్ ఆమ్ ఆద్మీ పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యేల మీద  చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు వేయాలి అని  రాష్ట్రపతి కి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి గల కారణం రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఎమ్మెల్యేలంతా క్యాబినెట్ హోదా ప‌ద‌వులు పొందడం. అయితే ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర ఎన్నికల సంఘం  ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దీనితో ఆప్  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీ రాష్ట్రంలో ఉప ఎన్నికల వాతావరణం నెలకొంది.ఇదే క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా రాష్ట్రపతి తీసుకునే నిర్ణయానికి కంగుతిన్నాడు. 2015 నుంచి 2016 వరకు 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు కేబినెట్ హోదాలో పార్లమెంట్ కార్యదర్శులు గా పదవులు అనుభవించారు.

ఢిల్లీ లో కేవలం 7 గురికి మాత్రమే కేబినెట్ హోదా ఉండాలి. పరిపాలన సౌలభ్యం కోసమే తాను వారికీ పదవులు కట్టబెట్టానని కేజ్రీవాల్ చెప్పారు. 20 మందిపై అనర్హత వేటు పడడంతో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ మెజారిటీ 45 కి తగ్గింది. ఎన్నికల సంఘం సిఫారసు లేఖ పంపిన రెండు రోజుల్లోనే రాష్ట్రపతి దానిని ఆమోదించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: