గత నాలుగు నెలలనుండి కత్తి మహేష్ మరియు పవన్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన రచ్చ గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. అనవసరంగా పవన్ మీద కత్తి మహేష్ వాఖ్యలు చేయడం, వాటికి పవన్ అభిమానులు అతిగా స్పందించడం, ఇక నేను ఏమి తక్కువ తినలేదన్నట్లుగా కత్తి మహేష్ తీవ్ర స్థాయిలో పవన్ మీద విరుచుకపడ్డాడు. ఆఖరుకు ఈ మాటల దాడి  వల్ల కత్తికి ఇతర ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేస్కోవచ్చు.

పవన్ కు మద్దతు ఇచ్చే క్రమంలో పూనమ్ కౌర్ కత్తిని విమర్శించడం, మీ అందరి చీకటి బండారం బట్టబయలు చేస్తాను అని కత్తి మహేష్ వాఖ్యానించడం సంచలనం సృష్టించాయి. ఈ వివాదం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడంతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఉండదని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా కత్తిపై పవన్ అభిమానులు కోడిగుడ్లతో దాడి చేయడం, వారి మీద ఆయన కేసులు పెట్టడం, వెంటనే జనసేన ప్రతినిధులు రంగంలోకి దిగి కత్తి ని శాంతపరచడం, ఆయన కేసు వాపసు తీసుకోవడం, ఇక ఒక ఛానెల్  వేదికగా తామెప్పుడూ పరస్పర మాటల దాడులకు దిగబోమని హామీ ఇచ్చిపుచ్చుకోవడం, ఆ తర్వాత కత్తి మహేష్ , పవన్ అభిమానులు ఒక రెస్టారెంట్లో పార్టీ చేసుకోవడంతో వివాదం సమసిపోయింది.


అయితే ఉన్నట్లుండి కత్తి మహేష్ వివాదాన్ని ఎందుకు ఆపేయదలిచాడు ? అసలు పవన్  క్షమాపణలు చెప్పాలని  పట్టుపట్టి భీష్మించి కూర్చున్నవాడు ఎందుకు ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు ? ఏదైనా ఆశపెట్టారా లేక బెదిరించారా ? అన్న ప్రశ్నలు ప్రతీ ఒక్క మెదడులో మెదలాడడం సహజమే.


అయితే ఇటువంటి ప్రశ్నలే కత్తి మహేష్ కు ఒక టెలివిజన్ వార్తా ఛానల్ ఇంటర్వ్యూలో ఎదురయ్యాయి. ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కత్తికి ప్రశ్నవేస్తూ మీరు  ఈ వివాదాన్ని ఇంతటితో ఆపితే మీకు కొంత మేర డబ్బులు ఇవ్వడంతోపాటు భవిష్యత్తులో జనసేన పార్టీలో కీలక పదవి అంటగడతాం అని పార్టీ తరుపున కొందరు వ్యక్తులు మీకు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి దీనికి మీరు ఏం చెప్తారు అని అడగ్గా , కత్తి మహేష్ ఇవన్నీ వట్టి రూమర్లేనని ఆయన కొట్టిపడేశాడు.


ఇక తానెందుకు వివాదానికి స్వస్తి పలకదలిచాడో కూడా వివరంగా చెప్పేశాడు. ఆయన మాట్లాడుతూ ఒక మనిషి ఏదయినా వివాదాన్ని ఆపాలంటే మొదట ఆ మనిషి అనుకున్న డిమాండ్లు పూర్తవ్వాలి. నేను మొదటి నుండి పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ ఈ వివాదంపై  స్పందించాలని డిమాండ్ చేశాను. నాపైన  దాడి జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా నాకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశాను. 


జనసేన నుండి ప్రకటన వెలువడిన తర్వాత నా మొదటి డిమాండ్ నెరవేరింది. ఇక కేసు వాపసు తీసుకోవడానికి ముఖ్య కారణం దాడి చేసిన  వారిద్దరి కుటుంబనేపథ్యాలు సరిగా లేకపోవడమే. అందుకే నా రెండవ క్షమాపణ డిమండ్ ను పట్టించుకోకుండా కేసు వాపసు తీసుకొని వివాదానికి నేనే చెక్ పెట్టాలని భావించినట్లు  ఆయన తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: