ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కొత్త సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయి అన్నట్టు గానే ఉంది పరిస్థితి చూస్తుంటే .. రాష్ట్రంలో రెండు మిత్రపక్ష పార్టీలైన టీడీపీ  బీజేపీల  ప్రస్తుత పరిస్థితి ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షనేత వైయస్ జగన్ బీజేపీతో జత కట్టడానికి సిద్ధమయ్యారు అని తెలుస్తోంది. తాజాగా ఇటీవల నేషనల్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో జత కట్టడానికి సిద్ధమని కండిషన్ పెడుతు స్టేట్ మెంట్  ఇచ్చారు.

ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం నాయకులు జగన్ మీద విమర్శలదాడి చేయడం మొదలుపెట్టారు, దేశంలోనే లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తితో ప్రధాని మోడీ కలవారిని రాజకీయ జ్యోస్యం చెప్పారు కొందరు టిడిపి నాయకులు. అయితే ఈ క్రమంలో  జగన్ పంపిన ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ ఏపీ బీజేపీ నాయకులని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాబుతో కంటే.. జగన్ తో కలిసి నడిస్తేనే బెటరని, 2019లో ఇలా ప్రయోగాత్మకంగా వెళ్ళిచూద్దామని ఇప్పటికే అమిత్ షాకు రహస్య సందేశాలు చేరినట్లు చెబుతున్నారు.

ఎవరి ఆశలు, అంచనాలు ఎలా వున్నా.. స్పెషల్ స్టేటస్ అనే ఆ మెలిక దగ్గరే వీళ్లందరి ఆలోచనలకు ‘సడన్ బ్రేక్’ పడిపోతోంది! మరొక పక్క నెమ్మదిగా వైకాపా మీద విమర్శలు తగ్గించి అంతర్గతంగా జగన్ కి భజన కూడా చెయ్యడం మొదలు పెట్టారట బీజేపీ జనాలు. కొందరు జగన్ కి ఫేవరేట్ గా భజన చేస్తున్నా మరికొందరు మాత్రం లాజికల్ గా జగన్ కి ఫ్యూచర్ ఇస్తే ఖచ్చితంగా మంచి చేస్తాడు అనే నమ్మకం తో ఉన్నారు అని తెలుస్తోంది. ఏదేమైనా జగన్ మోహన్ రెడ్డి మీద బీజేపీ కి సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టే అనిపిస్తోంది 


మరింత సమాచారం తెలుసుకోండి: