150 ఏళ్లకోసారి మాత్రమే ఆవిష్కృతమయ్యే ఆ అరుదైన ఘటనకు ఈరోజు వేదికవుతోంది. ఆకాశంలో ఎన్నడూ చూడని వింత కనిపించనుంది. అద్భుత దృశ్యం గగనంలో సాక్ష్యాత్కరించబోతోంది. చంద్రుడు పూర్ణుడై కనిపించే పౌర్ణమి, చల్లని మామ చందమామ భూమికి చేరువగా.. మరింత ప్రకాశవంతగా కనిపించే సూపర్ మూన్ డే, సూర్య చంద్రులకు నడుమ భూమి వచ్చి చేరడంతో నల్లని నీడ చాటున చందమామ దాగిపోయే సంపూర్ణ చంద్రగ్రహణం. ఏడాదిలో 12సార్లు కనిపించే పున్నమి అదనంగా కనిపించే రోజైన బ్లూ మూన్ డే. ఈ నాలుగింటిలో ఏదీ సర్వసాధారణం కాదు. అన్నీ విశేషాలే. అలాంటి విశేషాలన్నీ ఒకే రోజు ఏర్పడితే.. ఖగోళంలో అద్భుతం జరిగినట్లే. అలాంటి అద్భుతమే ఈరోజు ఆకాశంలో ప్రకాశించనుంది.

Image result for moon january 31

అసలు పౌర్ణమి రోజు చంద్రుడు ఎందుకు నిండుగా కనిపిస్తాడు..? పగలంతా భగభగమండే సూర్యుడు సాయంత్రం వేళలో గగనంలోకి దాగిపోగానే.. చంద్రడు చల్లటి కాంతులు వెదజల్లుతాడు. ఇది రోజూ మనం చూసే తంతే. కానీ చీకటిలో ప్రకాశించే చందమామకు స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. సూర్యుడి కాంతి చంద్రుడిపై పడినప్పుడు మాత్రమే చందమామ వెలుగులు మనం చూడగలం. అలా సూర్యుడి కాంతి పూర్తిగా చంద్రుడిపై పడినప్పుడు మనకు చంద్రుడు పరిపూర్ణుడై కనిపిస్తాడు. అదే పౌర్ణమి. ఈ నెల 1వ తేదీ చంద్రుడు పరిపూర్ణుడై కనిపించాడు. మళ్లీ ఈనెల 31న కూడా చంద్రుడు పరిపూర్ణుడై కనిపంచనున్నాడు.

Image result for super moon

చంద్రగ్రహణం అంటే చంద్రుడు కనిపించకుండా ఉండే రోజు. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది కాబట్టి ఆ రోజు చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి నాడే జరుగుతుంది.. చంద్రగ్రహణం అంటే పరిపూర్ణుడిగా ఉన్న చంద్రుడు నెమ్మదిగా కనిపించకుండా మాయమైపోతాడు..

Image result for blood moon

చంద్రగ్రహణం జరుగుతున్న సమయంలో.. చంద్రుడు భూమి చుట్టూ తిరిగుతూ క్రమంగా ఫేడ్ అవుట్ అవుతాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో చంద్రుడు మాయమవ్వడు.. సూర్యుని కాంతి భూమి మీద పడి.. భూమి చుట్టూ ఉన్న రేణువుల ప్రకాశించి.. ఆ వెలుగు గ్రహణం పడుతున్న చంద్రునిపై పడి.. ఎర్రటి కాంతులతో ప్రకాశిస్తాడు. గ్రహణం వీడే సమయంలో ఆ ఎర్రని కాంతులు తొలిగిపోయి.. చంద్రుడు సహజ రూపాన్ని సంతరించుకుంటాడు. ఈరోజు కనిపించే చంద్రగ్రహణంలో కూడా చంద్రుడు ఎర్రటికాంతులు వెదజల్లుతాడు.

Image result for blue moon

బ్లూ మూన్ అంటే ఎక్స్ ట్రా ఫుల్ మూన్ అని అర్థం. పౌర్ణమికి, పౌర్ణమికి మధ్య 29.5 రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి.. ఒక్కోసారి ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తుంటాయి. దాన్ని బ్లూమూన్ డే అంటారు. ఈ నెలలో ఒకటో తేదీన పౌర్ణమి వచ్చింది.. మళ్లీ ఈరోజు పౌర్ణమి వస్తోంది.. అదే బ్లూమూన్ డే. అలాగే ఈరోజు సూపర్ మూన్ కనిపించనుంది. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి చాలా దగ్గరగా కనిపిస్తాడు. దీని వల్ల చంద్రుడు ఎప్పుడూ ప్రకాశించేదానికన్నా 30శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలాగే ప్రతి పౌర్ణమికి కనిపించే దానికన్నా.. 14శాతం పెద్దగా చంద్రుడు కనిపిస్తాడు. ఆ వింత కూడా ఈరోజు కనిపించనుంది. ఇప్పటి వరకూ చెప్పుకున్న చంద్ర వింతలన్నీ ఒకే రోజు కనిపించబోతున్నాయి. సాధారణం కంటే పెద్దదిగా, ప్రకాశవంతంగా, ఎర్రటికాంతిలో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపించనుంది. ఈ విషయాన్ని ధృవీకరించిన నాసా భారత్, అమెరికా, యూకె, యూఎస్ లో ఈ వింత కనిపించనుందని స్పష్టం చేసింది.

Image result for solar eclipse

ఈరోజు సాయంత్రం 6గంటల 21 నిమిషాల నుంచి 7గంటల 37నిమిషాల వరకు ఈ సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో  రాత్రి 11.51 నుంచి అర్థరాత్రి ఒంటి గంటా 7నిమిషాల వరకూ కనిపిస్తుంది. అమెరికాలో ఉదయం 5 గంటల నుంచి 6గంటల వరకు కనిపిస్తుంది. యూకెలో అర్థరాత్రి 12గంటల 51నిమిషాలకు కనిపిస్తుంది. ఆకాశంలో కనులువిందు చేస్తూ.. సంబ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు రెడీగా ఉండండి.


మరింత సమాచారం తెలుసుకోండి: