ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రం మీద పోరాటం చేస్తున్నా ఎంపీల మీద కేంద్రానికి చిన్నచూపు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సభలలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రముఖ వ్యాపారస్తులు కావడంతో కేంద్రం విరు చేస్తున్న ఆందోళనలు పట్టించుకోవడం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఎందుకంటే చాలా సందర్భాలలో కేంద్రంతో వీరు వ్యవహరించిన తీరు...మామూలుగా కేంద్రంలో పెద్దలకు రాష్ట్ర ఎంపీల పట్ల ఉన్న అభిప్రాయమేమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కేవలం తమ వ్యాపారా లబ్ది కోసం పని చేస్తారు అనే అభిప్రాయం ఉంది. అయితే ఈ క్రమంలో వారి చేస్తున్న ఆందోళనలు కేవలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి మరియు మీడియాలో హైలెట్ అవ్వడానికి అంటున్నారు రాజకీయ పెద్దలు.


ఇలా ఎంపీలకు మెండుగా వ్యాపారాలు ఉండడంతో...ఇదే వీరిని కేంద్రం ప‌ట్టించుకోకుండా చేస్తోంద‌ట‌. ఏపీ టీడీపీ ఎంపీలు, అధినేత చంద్ర‌బాబు చేసే ప్రతిపాదనలను, వారి డిమాండ్లను మోదీ ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడానికి కారణం.


మరియు అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం కేంద్రానికి బాగా కలిసివచ్చింది….ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గట్టిగా అడగ లేకపోవడానికి కారణం ఇది కూడా ఒకటి. ఏదిఏమైనా రాష్ట్ర ప్రభుత్వ ఎంపీలు చిత్తశుద్ధితో కాకుండా తమ వ్యక్తిగత స్వార్థం కోసం చేసిన పనులు ఇప్పుడు రాష్ట్ర ప్రజలను కొంప ముంచుతున్నాయి అని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: