సన్నీ లియోన్.. ఈ పేరు తెలియనివారు చాలా అరుదుగా మాత్రమే ఉంటారేమో.! అమెరికన్ పోర్న్ స్టార్ గా పేరొందిన ఈ భామ.. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ కు దిగుమతైంది. అప్పటి నుంచి ఇండియన్ యూత్ లో యమా క్రేజ్ నింపుతోంది. అయితే .. ఓ రైతు కళ్లలో సన్నీ లియోన్ నింపిన ఆనందం.. ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.


          ఇక స్టోరీలోకి వద్దాం.. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బండకింది పల్లెలో చెంచురెడ్డి అనే రైతు నివశిస్తున్నాడు. వ్యవసాయమే అతని జీవనాధారం. వెరైటీ పంటలు పండించడం అతని హాబీ.. ఊరందరూ ఓ రకం పంటలేస్తే.. చెంచురెడ్డి మాత్రం ఇంకో పంటను ఎంచుకుని సవాల్ విసురుతుంటారు. ఈ ఏడాది కూడా చెంచురెడ్డి పదెకరాల్లో క్యాబేజీ, కాలీ ఫ్లవర్ పంట వేశారు. అది మంచి దిగుబడి ఇచ్చేలా ఉంది. అందుకే ఊరందరి దృష్టీ .. కాదు కాదు.. దిష్టి చెంచురెడ్డి పంటపై పడింది. దీంతో ఆయన కంగారు పడిపోయారు.

Image result for idols in paddy field

          పంటకు దిష్టి తగలకుండా ఉండేందుకు రైతులు పొలాల్లో దిష్టిబొమ్మలు పెట్టడం చాలా కామన్. కుండలతో తయారు చేసిన బొమ్మలు, గుమ్మడికాయలు, రంగురంగుల చీరలు.. ఇలా అనేక రకాలైన వేషాలతో కూడిన దిష్టిబొమ్మలను పంటపొలాల్లో పెట్టుకోవడం చాలా కామన్. అయితే చెంచురెడ్డి మాత్రం ఇలా ఆలోచించలేదు. అలా చిన్న దిష్టిబొమ్మలు సరిపోవనుకున్నారో ఏమో.. చాలా పెద్దగా ఆలోచించారు. ఏమాత్రం దిష్టి తగలకుండా ఉండేందుకు వెరైటీగా ఆలోచించారు.

Image result for sunny leone in paddy field

          అందుకే.. ఏకంగా శృంగార తార సన్నీలియోన్ ను పొలం గట్టుకు తరలించారు. ఎర్రటి బికినీతో ఉన్న సన్నీలియోన్ నిలువెత్తు పోస్టర్ ను పొలంగట్టుపై పెట్టారు. నన్ను చూసి ఏడవకండిరా.. అనే స్లోగన్ తో సన్నీ లియోన్ ను అడ్డంగా పెట్టారు. అంతే.. ఒక్కసారిగా ఊరందరి లుక్ మారిపోయింది. పొలంవైపుగా వచ్చే వాళ్లందరి చూపూ ఇప్పుడు పంటపై కాకుండా పాపపై పడుతోంది. దీంతో చెంచురెడ్డి ప్లాన్ వర్కవుట్ అయింది. సన్నీలియోన్ పోస్టర్ ను గట్టుపై ఉంచడం ద్వారా పంటపై పడాల్సిన దృష్టి సన్నీలియోన్ అందమైన పోస్టర్ పై పడుతోంది. దీంతో.. తన పంటకు ఎలాంటి దిష్టి తగలదనేది చెంచురెడ్డి వాదన.

Image result for sunny leone in paddy field

          సన్నీలియోన్ పోస్టర్ ను ఇలా గట్టుపై పెట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదా.. అని అడిగినప్పుడు చెంచురెడ్డి చెప్పిన సమాధానం అందర్నీ ఆలోచింపజేస్తోంది.! నా పంట నాశనమైపోయినప్పుడు ఏ అధికారీ ఇటువైపు రాలేదు.. ఇప్పుడు వాళ్లు ఎలా వస్తారు..? అని చెంచురెడ్డి ప్రశ్నిస్తున్నారు. నేనేమీ ఎవర్నీ కించపరచలేదు.. సినిమా పోస్టర్ లాగే.. ఇక్కడ నేనొక పోస్టర్ పెట్టుకున్నాను .. అంటూ సమర్థించుకున్నారు. ఏదైతేనేం.. చెంచురెడ్డిని సన్నీలియోన్ కాపాడింది. శెభాష్.. సన్నీ..!!


మరింత సమాచారం తెలుసుకోండి: