ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దేశంలో బిజెపి పార్టీ పరిస్థితి క్రమ క్రమంగా తగ్గిపోతుంది. గత ఎన్నికలలో దేశమంతటా నమో గాలి వీచింది. అయితే ప్రస్తుతం దేశంలో దానికి భిన్నంగా ఉంది వాతావరణం బిజెపి పార్టీ పట్ల. ముఖ్యంగా గత ఎన్నికలలో మోడీ జపం చేసిన యువత ప్రస్తుతం మోడీ అంటే ఆలోచిస్తున్నారు.


అంతే కాకుండా బిజెపి పార్టీని అధికార పీఠం నుండి ఎలా దింపాలి  అన్ని ప్రణాళికలు వేస్తున్నారు దేశంలోని యువత. నాలుగు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అవినీతిమయం చేసిందని వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించిందని కాంగ్రెస్ ముక్త్ భార‌త్ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.


మోదీపై బోలెడు ఆశ‌లు పెట్టుకున్న యువ‌త‌కు అంచ‌నాలు క‌రిగిపోయాయి. అందుకే, బీజేపీకి ఓటేయొద్ద‌ని సామూహికంగా ప్ర‌తిజ్ఞ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం బీజేపీకి ద‌క్షిణాదిన క్రేజ్ త‌గ్గింది. కాంగ్రెస్‌కి కాస్త పాజిటివ్ సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.


ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌లు, జీఎస్‌టీ, నోట్ల ర‌ద్దు పై జ‌నం తిర‌గ‌బ‌డుతున్నారు. అవే యూత్‌లోనూ నెగిటివిటీని పెంచుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయం వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత బిజెపిని బాయ్ కట్ చేసింది. వచ్చే ఎన్నికల లో బిజెపి పార్టికి ఓటు వేయకూడదని ఆంధ్ర యువత నిర్ణయించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: