ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం మీద యుద్ధానికి సిద్ధమైపోయారు. ఇష్టమొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం మిద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర క్యాబినెట్ లో ఉన్న తన పార్టీ మంత్రులను రాజీనామాలు చేపించే దిశలో ఉన్నట్లు సమాచారం.


ఇంతక ముందు బడ్జెట్ సమావేశాలలో తన పార్టీ ఎంపీలతో ఆందోళనలు నిరసనలు చెప్పించారు చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేసిన నేపథ్యంలో అయినా సరే కేంద్రం దిగిరాక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇక కేంద్రంలో మిత్ర‌ప‌క్షంలో ఉండ‌డం కూడా అన‌వ‌స‌ర‌మ‌నే అంచ‌నాకు వ‌చ్చారు.


తాజాగా ముందుగా కేంద్రంలో మంత్రుల‌యిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు, సుజ‌నా చౌద‌రితో రాజీనామా చేయించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. మార్చి 5 త‌ర్వాత ఏ క్ష‌ణ‌మైనా కేంద్ర మంత్రులు ఎన్‌డీఏ స‌ర్కార్‌కి గుడ్ బై చెప్ప‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.


అయినా సరే కేంద్రం స్పందించకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పట్ల సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితో కాకుండా రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ తీసుకున్నా వైసీపీ పార్టీ ఎంపీల రాజీనామా నిర్ణయానికి పోటీగా చంద్రబాబు తీసుకున్నట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: