ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ – బీజేపీ ఉమ్మడిగా అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో ఆ రెండు పార్టీలూ అధికారం అనుభవిస్తున్నాయి. అయితే బడ్జెట్ రేపిన చిచ్చు ఆ రెండు పార్టీల మధ్య వివాదం రాజేసింది. దీంతో ఆ రెండూ తెగదెంపుల దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ టీడీపీ అధినేత చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు.

Image result for babu vs modi

          రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని టీడీపీ చెప్తోంది. బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక నిధులేవీ కేటాయించలేదంటూ ఆ పార్టీ అసంతృప్తి గళం వినిపిస్తోంది. అంతేకాక సమావేశాలు జరిగినన్ని రోజులూ పార్లమెంట్ లో గట్టిగా గళం వినిపించింది. బీజేపీపై నేరుగా విమర్శలు గుప్పించింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని స్పష్టం చేసింది. అదే సమయంలో బీజేపీ కూడా గట్టిగానే టీడీపీకి బదులిచ్చింది. అయినా టీడీపీ ఏమాత్రం తగ్గట్లేదు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ పోరాడి.. ఆ తర్వాత కీలకమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.

Image result for tdp vs bjp

          చంద్రబాబు వైఖరి పసిగట్టిన బీజేపీ ఆయన్ను దారిలోకి తెచ్చుకోవాలని విశ్వప్రయత్నాలూ చేస్తోంది. ప్రతిష్టంభనను తొలగించేందుకు అటు మోదీ కానీ, అమిత్ షా కానీ చొరవ చూపలేదు. దీన్నిబట్టి టీడీపీతో దోస్తీని తెగేదాకా లాగే ఉద్దేశమే కనిపిస్తోంది. అటు చంద్రబాబు కూడా ఇదే వైఖరితో ఉన్నారు. రాష్ట్రానికి న్యాయం చేస్తారని బీజేపీతో కలిస్తే.. ఇప్పుడు హ్యాండివ్వడాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రజాకోర్టులో బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీతో బీజేపీ చేస్తున్న అంతర్గత స్నేహాన్ని కూడా ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.

Image result for kapu reservation in ap

          ఈ వ్యవహరాలన్నింటినీ ఆచితూచి వ్యవహరిస్తున్న బీజేపీ.. సరైన సమయం కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పుడు కాపు కార్పొరేషన్ల రూపంలో కేంద్రానికి తొలి అవకాశం లభించింది. కాపులతో పాటు వివిధ వర్గాలను బీసీల్లో చేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే.. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది. వివిధ శాఖల అభిప్రాయం కోరింది. అయితే సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ – డీవోపీటీ ఈ బిల్లుకు అభ్యంతరం తెలిపింది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్ని సుప్రీంకోర్టును తీర్పును ఆ శాఖ ప్రస్తావించింది. దీంతో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాపు రిజర్వేషన్ బిల్లు మూలన పడినట్లయింది.

Image result for kapu reservation in ap

          అయితే.. తమిళనాడులో 50 శాతానికి మించి ఉన్న రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలిపినప్పుడు కాపు రిజర్వేషన్ బిల్లును పక్కన పెట్టడం సరికాదని టీడీపీతో పాటు కాపులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకోసమే బీజేపీ.. బిల్లును తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. తద్వారా టీడీపీకి మైలేజ్ రాకుండా చూడాలని మోదీ భావిస్తున్నారనేది టీడీపీ శ్రేణుల ఆరోపణ. ఒకవేళ కాపు రిజర్వేషన్ బిల్లుకు ఎన్నికల్లోపు ఆమోదం రాకుంటే అది తప్పకుండా అటు టీడీపీ, ఇటు బీజేపీలపై ప్రభావం చూపించడం ఖాయం. అసెంబ్లీ ఆమోదించినా కేంద్రంలో బీజేపీ ఆమోదించలేదని టీడీపీ బ్లేమ్ చేస్తుంది. అదే సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని కాపులు టీడీపీని బ్లేమ్ చేసే అవకాశం కలుగుతుంది. ఏదైతేనేం.. బిల్లుకు అభ్యంతరం తెలపడం ద్వారా చంద్రబాబుకు మోదీ ఫస్ట్ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: