పవన్ కళ్యాణ్ 2019 లో టీడిపి కి మద్దతు ఇచ్చి ఆ కూటమిని గెలిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు దేశం మీద వ్యతిరేకత ఎక్కువ అవడం తో ఇప్పుడు పవన్ ఆలోచనలో పడినట్టున్నాడు. టీడిపికి అనుకూలంగా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని పవన్ కి అర్ధం అయ్యింది. సంయుక్త ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రెండో రోజు సమావేశం ప్రారంభమైంది.
Image result for pawan kalyan and chandrababu
ఈ సందర్భంగా ట్విట్టర్ లో జనసేన తరపున పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా వుంది. అమరావతిలో ప్రైవేటు విద్యాసంస్థలకు వందలాది ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ విశాఖలో కేంద్రం తలపెట్టిన ఐఐఎంకు మాత్రం స్థలం కేటాయించలేదు.ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీలోనే కొనసాగుతోంది అని జనసేన పార్టీ రెండో రోజున ఓ ఫ్యాక్ట్ ను కనిపెట్టింది. అంటూ పోస్ట్ చేసారు.
Image result for pawan kalyan and chandrababu
దాంతో చంద్రబాబు, తెలుగుదేశం వ్యతిరేక జనాలు విపరీతంగా స్పందిస్తున్నాయి. ఇలా నిజాయితీగా తవ్వితే చంద్రబాబు వ్యవహారాలు చాలా బయటకు వస్తాయని, అంతే కాదు, బాబు ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తుందనీ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ట్వీట్ కు వదలాది రీ ట్వీట్ లు, వేలాది లైకులు రావడం విశేషం. సాధారణంగా నెట్ లో తెలుగుదేశం పార్టీ అనుకూల వాతావరణం ఎక్కువ వుంటుంది. కానీ సూటిగా సుత్తిలేకుండా వేసిన ఈ పంచ్ నేరుగా జనాల్లోకి దూసుకుపోయినట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: