ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తారు అంటున్నారు కొంతమంది. ఈ సందర్భంగా త్వరలో హైదరాబాద్ లో జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ తాను కేంద్రంలోకి అధికారం వచ్చిన తరువాత ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి అలాగే  ప్ర‌భుత్వ విజ‌యాల‌తో పాటు ప‌లు అంశాల‌ పైనా స్పీచ్ ఇవ్వ‌నున్నార‌ట‌.


ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చేసిన మేలు గురించి కూడా మోడీ ప్రసంగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా ప్రధాని మోదీ మాట్లాడతారని అంటున్నారు బిజెపి వర్గాలు.


ఈ క్రమంలో మొదట ఈ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిర్వహిద్దాం అనుకొన్నారు ప్రధాని మోడీ కానీ ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రం మీద ఉన్న వ్యతిరేకత వల్ల జరగలేదని అంటున్నారు బిజెపి సన్నిహిత వర్గాలు.


ఈ పరిణామంలో ప్రధాని మోడీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అమలు చేయాల్సిన హామీల విషయమై స్పష్టమైన ప్రకటన చేస్తారని అంటున్నారు బిజెపి సభ్యులు. దీంతో మోదీ నుంచి ఏదో ఒక సానుకూల ప్ర‌క‌ట‌న చేయించాల‌ని కేంద్రం నుంచి కూడా ఓ సూచ‌న ఉంద‌ట‌. అలాగే ఇదే వేదికపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా ప్రధాని మోడీ ప్రసంగిస్తారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: