గతకొంతకాలం నుండి టీడీపీ, తమ మిత్ర పార్టీ అయిన బీజేపీ మధ్య పోరు సవతుల పోరుకన్నా ఘోరంగా తయారవుతూ వస్తుంది. టీడీపీ పొత్తు తెగదెంపులు చేసుకొనబోతుంది అని వార్తలు వచ్చినా  ప్రస్తుతం బీజేపీ తో పొత్తు కొనసాగించాలని టీడీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాగా జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరగిన విషయం తెలిసిందే. బీజేపీ పై ఉన్న కోపాన్ని ప్రజలు తమ మీద చూపిస్తారనే ఉద్దేశ్యంతోనే టీడీపీ నేతలు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.


టీడీపీ కి సంబంధించి చిన్నస్థాయి నేతల దగ్గర నుండి పైస్థాయి నేతల దగ్గర వరకు అందరూ ఏదో ఒక చోట ఏదో ఒక సంధర్భంలో బీజేపీ ని తిట్టిపోసుకున్నవారే. కానీ విడ్డూరం ఏంటంటే బీజేపీ నేతల్లో కేవలం ఒక్క నేతనే టీడీపీకీ ముఖ్యంగా బాబుకు గుబులుపుట్టిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో గుజరాత్ ఎలక్షన్ల మీద ఒక టీవీ ఛానెల్లో చర్చ జరుగగా బీజేపి ఎప్పుడూకూడా టీడీపీ పై ఆధారపడలేదని, పరిస్థితులు ప్రభావితం చేస్తే ఎవరి మద్దతులేకుండా పోటీ చేస్తామని తెలిపాడు.


రాజకీయ పొత్తు ఉన్నా టీడీపీ నుండి బీజేపీ నాయకులకు ఏమీ ఒరగలేదని, ఒక్కటంటే ఒక్క ఉపయోగం కలగలేదని కుండబద్దలు కొట్టాడు. మొన్న జరిగిన టీడీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశం ముందు కూడా బాబు అన్ని కోట్లు ఎలా సంపాదించావో లెక్కచెప్పు అని సవాల్ విసిరాడు. ఇక సమావేశం తరువాత జరిగిన ప్రెస్ మీట్లో ఆ మాటలను వీర్రాజు విఙ్ఞతకే వదిలేస్తున్నా అని సుజనాచౌదరి మాట్లాడడానికి నిరాకరించాడు. ఇందుకుగల కారణాలూ లేకపోలేదు. అతను ఎన్ని విమర్శలు చేసినా సహనంతో ఉండండి, అతిగా స్పందించకండి అని బాబు తన కేడర్ కు సూచించాడట. మొత్తానికి బాబు ఎందుకు సహనం వహించండి అని చెప్తున్నాడో కానీ మోడీ ఢిల్లీ నుండే డైరెక్షన్ చేసి చంద్రబాబుకును కంట్రోల్ లో పెట్టుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: