కర్నూలు ఉపఎన్నిక ఫలితం దెబ్బకు శిల్పా బ్ర‌ద‌ర్స్  రాజకీయ జీవితం అంధకారంలో పడిపోయింది. భూమా నాగిరెడ్డి మరణంతో కర్నూలులో జరిగిన ఉపఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో వైయస్సార్సీ పార్టీ తరపున నిలబడినా శిల్పా మోహన్ రెడ్డి ఉపఎన్నికలలో గెలుపు కోసం చాలా తీవ్రంగా కష్టపడ్డారు.


ప్రస్తుతం జిల్లాలో శిల్పా బ్ర‌ద‌ర్స్  పై అనేక కామెంట్స్ వినబడుతున్నాయి. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు, ఆత్మ‌హ‌త్యలే అనేది నానుడిని వీరు నిజం చేశార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాజకీయంగా మంచి స్థానంలో ఉన్న స‌మ‌యంలో సోద‌రులు వైసీపీలోకి జంప్ చేయ‌డం.. వారుచేసిన రాజ‌కీయ చారిత్ర‌క త‌ప్పిదమ‌ని చెబుతున్నారు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు.


కర్నూలులో భూమా నాగిరెడ్డి మరణం సెంటిమెంట్ తన గెలుపుకు అడ్డుపడుతున్న తెలిసి కూడా పంతానికి పోటీ చేశారు మోహ‌న్‌రెడ్డి. ఎన్నికల కోసం తీవ్రంగా కష్టపడ్డారు అలాగే ఆర్థికంగా ఉప ఎన్నిక కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు.


తిరా ఉపఎన్నిక ఫలితాలు వచ్చాక శిల్పా బ్ర‌ద‌ర్స్ కి షాక్ తగిలింది. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భయంకరమైన ఊహించని మెజార్టీతో గెలవడం జరిగింది. ప్రస్తుతం శిల్పా బ్ర‌ద‌ర్స్ అనవసరంగా వైసీపీ పార్టీలో వచ్చామని పశ్చాతాపం పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: