అమ్మాయిలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అబలలు కాదు సబలలు అని నిరూపించుకుంటున్నారు. అయితే కొందరు అమ్మాయిలు అకారణంగా తనువు చాలిస్తున్నారు. పెద్ద కారణాలేం ఉండవు. కానీ విపరీతంగా ఆలోచించి క్షణికావేశంలో దూరమైపోతున్నారు. అలాంటిదే అనీషా చౌదరి ఘటన.

Image result for anisha suicide

          అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత జగ్గయ్య చౌదరి కుమార్తే అనీషా చౌదరి. రాజకీయంగా లోకల్ గా మంచి పలుకుబడి కలిగిన కుటుంబం. మంచి చదువులకోసం కుమార్తె అనీషాను తండ్రి హైదరాబాద్ లోని శివశివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏలో చేర్పించారు. ఇప్పుడు రెండో సంవత్సరం చదువుతోంది. కాలేజీ హాస్టల్ లోనే ఉండి చదువుకుంటోంది. చదువులో ముందుండే అనీషా ఇలా అర్ధాంతరంగా దూరమవుతుందని అటు కుటంబసభ్యులు కానీ, స్నేహితులు కానీ ఊహించలేదు.

Image result for anisha suicide

          అనీషా చౌదరి చాలా యాక్టివ్ గా ఉంటుంది. చిన్న పిల్ల మనస్తత్వమని ఆమె సన్నిహితులు చెప్తున్న మాట.  చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం.. అంతలోనే చల్లారిపోవడం అనీషా నైజం.. ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఆ క్షణానికి కోపం తెచ్చుకున్నా దాన్ని మనసులోకి తీసుకోకుండా మళ్లీ కూల్ అయిపోవడం అనీషా స్టైల్. అందుకే అనీషాను అందరూ ఇష్టపడుతుంటారు. చాలా లైట్ తీసుకునే అమ్మాయి. అనంతపురంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కు చెప్పిందంటే ఎంత ఓపెన్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంత ఓపెన్ గా ఉండే అమ్మాయి ఇలా ఎందుకు సూసైడ్ చేసుకుంది?

Image result for anisha suicide

          తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి అన్న విషయాలను ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంది అనీషా. అంతేకాదు.. మాజీ బాయ్ ప్రెండ్ పెళ్లికి కూడా వెళ్లాలనుకుంది. సాధారణంగా మాజీల పెళ్లిళ్లకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టం చూపరు. మళ్లీ నాటి సంఘటనలన్నీ గుర్తొస్తాయని వెనకాడతారు. కానీ అనీషా అలాంటిది కాదు.. అన్నిటినీ జీర్ణించుకోగల సత్తా ఆమెకుంది. అందుకే మాజీ బాయ్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాలని డిసైడైంది. అదే విషయం ప్రస్తత బాయ్ ఫ్రెండ్ కి చెప్పింది. అతను కూడా సరేనన్నాడు. అయితే ఎక్కడో చిన్న సందేహం.. వెళ్తే ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ ఏమనుకుంటాడోనని అనుమానం. ఆ అనుమానమే ఇప్పుడు అనీషాను అంతం చేసింది. ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. ఓపెన్ మైండ్ తో ఎలాంటి విషయాలనైనా డేర్ గా డీల్ చేయగల అనీషా .. ఇప్పుడు చిన్న అనుమానాన్ని కూడా భరించలేకపోయింది. తనకున్న సహజ క్షణికావేశం అనీషాను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఆ ఒక్క క్షణం... ఎంత విలువైనదో తెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: