వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని దృడ సంకల్పంతో ఉన్నాడు. ఈ సందర్భంగా జగన్ వైయస్ఆర్సిపి పార్టిలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ తాను కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధమైపోయాడు. ఈ క్రమంలో తనకు రాజకీయ సలహాదారుడిగా దేశంలోనే అత్యంత రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ అయినా పీకే.. అలియాస్ ప్ర‌శాంత్ కిషోర్‌ ని నియమించుకున్నాడు.


ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలతో నాయకులతో నవరత్నాలు పతాకం ప్రకటించినప్పుడు ప్రశాంత్ కిషోర్ వైయస్సార్సీపి పార్టీకి సలహాదారుడిగా ఉంటారని జగన్ స్పష్టం చేశారు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ గురించి ఓ ఆంగ్ల వెబ్ సైట్ సంచలనకరమైన కథనాన్ని ప్రచురించింది. రీసెంట్‌గా సండే గార్డియ‌న్‌లైవ్ అనే ఓ ఆంగ్ల వెబ్‌సైట్ పీకే గురించి ఆస‌క్తిక‌ర క‌థ‌నం ప్ర‌చురించింది.


దీని ప్ర‌కారం పీకే త‌న ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ టీమ్ నుంచి రీసెంట్‌గా ఉద్యోగాల కోత విధిస్తున్నాడ‌ట. నిన్న‌మొన్న‌టి దాకా ఈ టీమ్‌లో ఏకంగా 200 మంది ప‌నిచేస్తుండ‌గా, తాజాగా అది 50కి ప‌రిమితం చేశాడ‌ట‌. అంతేకాకుండా తన టీం సభ్యులకు జీతాలు కూడా భారీగా తగ్గించేశారు...మరి అదే విధంగా సరైన సమయంలో కూడా జీతాలు చెల్లించలేక పోతున్నాడట ప్రశాంత్ కిషోర్.


మరి అదే విధంగా రాబోయే ఆయా రాష్ట్రాల ఎన్నికలలో జాతీయ పార్టీల నుండి పిలుపు వస్తుందని ఆశించాడు ప్రశాంత్ కిషోర్ కానీ తీరా చూస్తే ఏ పార్టీ నుంచి కూడా పిలుపు రాలేద‌ట‌. అందుకే, త‌న టీమ్‌లో కోత విధించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న వ్యూహ‌క‌ర్తగా వ్య‌వ‌హ‌రిస్తోంది ఒక్క వైసీపీకే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వైయస్ఆర్ సీపీ పార్టీ మిద పూర్తి దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో వైయస్సార్ సిపి పార్టీ విజయంతో దేశంలో ఇదివరకు తనకున్న పేరును తిరిగి రప్పించు కోవాలనుకుంటున్నడు జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.

మరింత సమాచారం తెలుసుకోండి: